విజయవా కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పునఃప్రతిష్టించాలని కోరుతూ విగ్రహం పున ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కమిటీ సభ్యులు ధర్నాకు దిగారు. కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించి వెంటనే విగ్రహం పున:ప్రతిష్టించాలని వారు కోరారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో గత టీడీపీ ప్రభుత్వం విగ్రహాన్ని అన్యాయంగా తొలగించిందని, విగ్రహాలను తొలగించారు కానీ ప్రజల మనసుల్లో నుంచి వైఎస్ ను తొలగించలేకపోయారని వారు విమర్శించారు.
కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కమిటీ సభ్యుల విజ్ఞప్తి చేస్తున్నారు.
సరిగ్గా ఏడాది కిందట జూలై 30 వైఎస్ విగ్రహం కూల్చేశారు. ట్రాఫిక్ కు ఈవిగ్రహం అంతరాయం కలిగిస్తున్నదని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ తీర్మానం చేసి పకడ్బందీగా విగ్రహాన్ని కూల్చేశారు. వైసిపి నేతలు, కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపినా కూల్చివేత ఆగలేదు. అపుడు ఇది చాలా పెద్ద వివాదానికి దారితీసింది.