ఇండియాలో తెగ పార్టీ చేసుకుంటున్నారు. మందు కొట్టే వాళ్ల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా 2010-2017 మధ్య మందు కొట్టడం 38 శాతం పెరిగింది. అయితే, సిగ్గపడాల్సిన పని లేదు, మందు కొట్టడం ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా వూపందుకుంది. లాన్సెట్ జర్నల్ అధ్యయనం ప్రకారం 1990 నాటి మోతాదుతో పోలిస్తే ఇుడు 70 శాతం పెరిగింది. చీర్స్.
భారత దేశంలో 2010-17 మధ్య తలసరి మందు సేవించడం 4.3 లీటర్ల నుంచి 5.9 లీటర్లుకు పెరిగిందని ఈ సర్వే చెప్పింది ఇదే అమెరికాలో 9.3 లీటర్ల నుంచి 9.8 లీటర్లకు పెగింది. చైనాలో 7.1 లీటర్ల నుంచి 7.4 లీటర్లకు పెరిగింది. కాబట్టి ఇండియా బాగా వెనకబడిందన్న విషయం మర్చిపోరాదు.
ఇండియాకు చెందిన ఎన్ ఎస్ ఎస్ వొ సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలో బాగామందుకొడుతున్నదని ఆంధ్రావాళ్లు.ఆ తర్వాత తెలంగాణ కేరళ వాళ్లు. కేరళలో సగటున మనిషి సంవత్సరానికి 10.2 లీటర్ల మందు సేవిస్తూ ఉంటే ఆంధ్రా లో చాలా చాలా ఎక్కువగా సగటున తలసరి 34.5 లీటర్ల మందుగొడుతున్నార. దేశంలో ఏ రాష్ట్రం ఆంధ్రా దరిదాపుల్లో లేదు.
ఆంధ్రప్రదేశ్ తర్వాత బాగా మందు కొట్టే రాష్ట్రాలు, తెలంగాణా, కేరళ, కర్నాటక, సిక్కిం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్