కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మరోసారి చిట్ చాట్ చేశారు. ఆయన ఏమన్నారో చదవండి.
విజయశాంతి నా పై చేసిన విమర్శలకు నేను కౌంటర్ కామెంట్ చెయ్యను.
విజయశాంతి కి పీసీసీ కావాలనే కోరిక ఉందేమో అని నాకు అనిపిస్తోంది.
ఆమెకు సినిమా స్టార్ గా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఆమె వల్ల కాంగ్రెస్ కు ఉపయోగమే. ఆమె సేవలను సౌత్ ఇండియా రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి ఉపయోగం.
పార్టీ కోసం టైం ఇచ్చి తిరిగితే ఆమె కు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుంది.
భవిష్యత్ లో పీసీసీ పదవి చేపట్టే వారు .. సీఎం పదవిపై ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేయాలి.
పీసీసీ కావాలనుకునే వారు స్వంత ఖర్చు లతో పార్టీ నడిపేలా ఉండాలి.
అప్పుడే పీసీసీ కి, కాబోయే సీఎం కు మధ్య సమన్వయం ఉంటుంది.
పదవుల కోసం .. డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్ళు కాంగ్రెస్ లో పుష్కలంగా ఉన్నారు.
ఈ అంశంపై త్వరలో రాహుల్ కు లేఖ రాస్తా ..
పార్టీ కోసం పని చేసిన ఉత్తమ్ అప్పుల్లో ఉన్నాడనేది వాస్తవం.
ఉత్తమ్ పీసీసీ నేత గా పార్టీ ఎదుగుదలకే పని చేశారు. సీఎం పదవిపై ఆయన ఆశతో పని చేయలేదు.
ఆయన పీసీసీ చేపట్టాక పార్టీకి ఫాయిదా లేదన్నది సరికాదు.
పార్టీ క్యాడర్ లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారు.
పార్టీలో సీనియర్లు అంతా పీసీసీ తో కలిసి పనిచేసినప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది.
ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఉత్తమ్ వైఫల్యం కాదు .. స్వంత ప్రయోజనాల కోసమే పిరాయింపులు.
ఉత్తమ్, కుంతియాలు అమ్ముడు పోయారనేది సరికాదు .. వాళ్ళను ఎవరు కొనలేరు .. వాళ్ళు పార్టీ సిస్టంలో పనిచేస్తున్నారు.
పార్టీలో కోవర్ట్ లు ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతా.