శ్రీలంక టెర్రరిస్టు బాంబులను ఇలా మోసుకుంటూ చర్చికొచ్చాడు (వీడియో)

రెండు రోజుల కిందట ఈస్టర్ నాడు శ్రీలంకలో మారణ కాండ సృష్టించిన పేలుళ్లకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

ఈ విషయాన్ని ఐఎస్ కు చెందిన వార్తా సంస్థ AMAQ ప్రకటించింది.
అయితే, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాన్ని ఈ సంస్థ వెల్లడించలేదు.

శ్రీలంక దాడులు ‘ఇస్లామిక్ స్టేట్ యోధులు’ చేసిన పనే అని ఈవార్తా సంస్థ చెప్పింది.

సాధారణంగా తమ వార్తలను ప్రచారం చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ AMAQ నే వాడుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే అనుమానితుడు బాంబు బ్యాక్ ప్యాక్ తో చర్చిలో కి వచ్చిన వైనం ఉన్న వీడియ్ క్లిప్ ని ఎఎన్ ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. (కింద)

 

 

&

అయితే, శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్లుకు, ఆమధ్య న్యూజిలాండ్ క్రిష్ట్ చర్చ్ మసీద్ కాల్పులకు సంబంధం ఉందని అక్కడి ప్రభుత్వం అనుమానిస్తున్నది.

న్యూజిలాండ్ ఒక శ్వేత జాతి దురహంకారి క్రిష్టచర్చ్ లోని మసీదులోకి చొరబడి ప్రార్థనలకు సిద్ధపడుతున్నపుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

అయితే, అదే విధంగా ఈస్టర్ రోజు ప్రార్థనలకు పాల్పడుతున్న క్రైస్తవులను హతమార్చేందుకు ఇస్లామిక్ సంస్థలు ప్రతీకారంగానే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాయని శ్రీలంక అధికారులు చెబుతున్నారు.

321 మందిని హతమార్చిన శ్రీలంక ఏడు పేలుళ్లలో  దాదాపు 500 మంది గాయపడ్డారు.

ప్రాథమిక దర్యాప్తుప్రకారం న్యూజిలాండ్ మాస్క్ దాడికి ప్రతీకారంగానే శ్రీలంక దాడులు జరిగినట్లు అర్థమవుతున్నదని శ్రీలంక హోం శాఖ జూనియర్ మంత్రి రువాన్ విజేవర్ధనే పార్లమెంటుకు తెలిపారు.

మార్చి 15 శుక్రవారం నాడు న్యూజిలాండులో జరిగిన పేలుళ్లకు,ఆదివారంనాటి శ్రీలంక పేలుళ్లకు ఎలా సంబంధం ఉందో మంత్రి వివరించలేదు.

అయితే, శ్రీలంక కు చెందిన నేషనల్ థావీద్ జమౌత్ , జమ్మియాతుల్ మిల్లతు ఇబ్రహీం అనే రెండు సంస్థులు అదివారం నాటి దాడుల వెనక ఉన్నాయని అయన వెల్లడించారు.

ఈ దాడులలో ఇస్తామిక్ స్టేట్ దాడుల ఆనవాళ్లు కనబడుతున్నాయని అమెరికా దర్యాప్తు సంస్థలు చెబుతున్నా, ఈసంస్థ ఇంతవరకు బాధ్యత తీసుకోలేదు.

శ్రీలంక సంస్థలకు,అంతర్జాతీయ సంస్థలతో సంబంధం ఉందా అనే కోణంలో పరిశోధన సాగుతూ ఉందని మంత్రి చెప్పారు. పోలీసులు ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్న 40 మందిలో ఒకరు సిరయాదేశస్ధుడని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *