తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381కిలోల బంగారంపై వివరణ ఇచ్చిన టిటిడి ఇఓ అనిల్ సింఘల్ వివరణ ఇచ్చారు. వివరణ.
బంగారు ద్రవ్యనిధి పథకం కింద పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1311కిలోల బంగారాన్ని 1.75శాతం వడ్డీరేటుపై డిపాజిట్ చేశాం. మూడేళ్ళ కాలపరిమితి 18వతేదీకి ముగిసింది. మరో 70కిలోలను స్విటర్జాండ్ లో కొనుగోలు చేసి 1311 కిలోల బంగారంతో కలిపి చెన్నై నుంచి తిరుపతికి తీసుకువస్తున్నాం. తమిళనాడులో ఈనెల 19వతేదీన 1381కిలోల టిటిడి బంగారాన్ని సీజ్ చేశారు. రసీదులు తీసుకెళ్ళి బంగారాన్ని ఖజానాకు తీసుకువచ్చాం. బంగారం డిపాజిట్ చేసిన తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంకు బాధ్యత తీసుకోవాలి. బంగారు సీజ్ కు పంజాబ్ బ్యాంకు అధికారులే బాధ్యత వహించాలి. బంగారంపై ఇన్ కంటాక్స్ అధికారులు టిటిడికి నోటీసులు ఇచ్చారు. వెంటనే చెన్నై వెళ్ళి తమిళనాడు పోలీసులకు, ఎన్నికల అధికారులకు బంగారం వివరాలను తెలియజేశాం. 20వతేదీ టిటిడి ఖజానాకు 1381 కిలోల బంగారాన్ని అందజేశారు. మొత్తం 9,752కిలోల బంగారం టిటిడిలో ఉంది.’ అని ఆయన వివరణ ఇచ్చారు.
చెన్నై నుంచి ఈ బంగారు ఆభరణాల తరలింపు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దీనిని ఎన్నికల కమిషన్ అధికారులు స్వాదీనం చేసుకోవడంతో శ్రీవారి బంగారం తరలింపుపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈ నెల 23వ తేదీలోపు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందించాలని ఆయన ఆదేశించాుు. చారణాధికారిగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ మన్మోహన్ సింగ్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ లోపు సింఘల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.