తెలంగాణలో ఎన్నికల సంఘం అధికారుల తీరును ఆది నుండి అనుమానిస్తూనే ఉన్నాయి విపక్షాలు. అధికార ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మరో కొత్త విమర్శ ఎదుర్కొంటోంది. ఎన్నికల సంఘం అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీపీసీసీ అధికార ప్రతినిధి సునీతారావ్.
ఆమె ఎలక్షన్ కమిషన్ ఐడి కార్డులో తన ఇంటి పేరు తప్పు పడిందని, మార్చాలని అనేకసార్లు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవట్లేదని ఆమె వాపోయారు. వారి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి ఆమ్రపాలి కి ఫిర్యాదు చేశారు. కేసును పరిశీలించి ఖైరతాబాద్ ఈ ఆర్ ఓ అశోక్ పై తగిన చర్యలు తీసుకుంటానని ఆమ్రపాలి హామీ ఇచ్చినట్లు సమాచారం.
సునీతారావ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన ఫిర్యాదు లేఖను కింద చూడవచ్చు.