నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడలో కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యులు కటకం మురళి, బలగం రామ్మోహన్ ‘వటోలి గ్రామ అడబాకే నగేష్, పంచాయతీ సెక్రటరీ చాట్ల గాయత్రి, విద్యార్ధి రాథోడ్ ప్రవీణ్’ ల సహాయంతో కొత్త చాళుక్య శాసనాన్ని గుర్తించారు.
ఉమ్మెడ శాసనం వివరాలు
శాసన స్థలం: ఉమ్మెడ కాలభైరవస్వామి గుడి సమీపాన రాతిగుండుపై (శాసన విస్తీర్ణం: 5అ.ల వెడల్పు, 4అ.ల ఎత్తు)
రాజు: త్రిభువనమల్ల 5వ విక్రమాదిత్యుడు(1008-1014) పంప పెర్మానడి
శాసన దాత: పల్లవరస, ప్రధానమంత్రి
కాలం: శక సం.933 ఫాల్గుణ మాస సోమగ్రహణ సందర్భం, 1012 ఫిబ్రవరి 10 ఆదివారం
శాసన లిపి: తెలుగన్నడం
శాసన భాష: కన్నడం
శాసన పంక్తులు: 17
కళ్యాణీ చాళుక్య చక్రవర్తి, త్రిభువనమల్ల 5వ విక్రమాదిత్యుని పాలనాకాలంలో సత్యరత్నాకర బిరుదాంకితుడు సోమరస పుణ్యంకొరకు మహా ప్రధాని పల్లవరస శక సం.933 ఫాల్గుణ మాస పౌర్ణిమ ఆదివారంనాడు అంటే 1012 ఫిబ్రవరి 10న చంద్రగ్రహణ సందర్భంగా సోమనాథుని కాళ్ళుకడిగి 60మర్తురుల భూమిని భట్టవ్రిత్తిగా, సర్వనమస్యం (సకలజన పూజనీయం)గా దానం చేసినట్లు ఈ శాసనంలో వివరించబడినదని శాసనాన్ని చదివిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. 5వ విక్రమాదిత్యుని శాసనం మరొకటి సంగారెడ్డి జిల్లా నందికందిలో లభించింది. తెలిసినంతవరకు ఇది అతని పేరునున్న రెండవ శాసనం అవుతుంది. ఇప్పటికే ప్రచురితమైన నిజామాబాద్ జిల్లా శాసన సంపుటిలో ఈ శాసనం లేదు. ఇది కొత్త శాసనమని చరిత్ర బృంద సభ్యులు తెలియజేసారు.
ఉమ్మెడ శాసన పాఠం: సూర్య, చంద్రులు ఆవుదూడ, శివలింగం
1. స్వస్తి సమస్త భువనాశ్రయ శ్రీప్రిథ్వీవల్లభ మ
2. రాజాధిరాజపరమేశ్వర పరమభట్టారక స
3. త్యాశ్రయకులతిలక చాళుక్యాభరణం త్రిభువనమల్ల
4. శ్రీమద్విక్రమాదిత్యదేవర చన్దళేయ బిడినోళ్ విజే
5. య రాజ్యగేయ్యత్తిరే సమధిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర
6. గంగాకులతిలకం కలికాలకర్ణ వివేకబృహస్పతి సత్యరత్నాకరం శ్రీమత్సోవరస
7. నీవరతావిరో స్వస్తి గంగాజలజాత వస్త్రపవిత్రీకృతోత్తమాంగీయరప్వ
8. శ్రీమంన్నిబపొవియద సకవర్ష 933నేయ విరోధకృత్సంవత్సరద పాల్గుణ(ద)
9. సోమగ్రహణవాదిత్యవారదన్దు శ్రీబల్లవరసం సమస్త ప్రధానరుమా
10. ఱింయి మగ్గిణ్ద(యి)ప్రత్తనాలతొలగొటిమ్మలేయ భట్టసామ్య దఱు
11. (వ)త్త మత్త కొల్యం మహారాజపట్టలనిపిపొవికొల్లపేయ
12. సోమనాథకాల్గ(చ్చి) సర్వనమస్యగొట్ట స్వస్తి సమస్తరాజ్య ప
13. ర నిరూపితమహామాత్య పదవి విరాజమానం రప్వ శ్రీమా
14. ల్మల్లపయ్యంగల మగం మహారాజ భట్టర మల్లీశ్వరద శంహి
15. మరకొనేప్నికత పొదవర్గేలన్నిభ్భర్గో సత్ర ఈకొట్ట స్వదత్తాం
16. పరదత్తాం వాయోహరేత వసుం(ధర) షష్టివర్ష సహస్రాణి
17. విష్టాయా జాయతే క్రిమిః
పరిశోధక బృందం: Katakam Murali-8106095618, Balagam Rammohan-9989040655- Kotha Telangana Charitra Brundam
శాసన పరిష్కారం: Sreeramoju Haragopal-9949498698, Convenor, Kotha Telangana Charitra Brundam