ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత కోసమే ఇతర పార్టీలకు చెందిన నాయకులు
కాంగ్రెస్ లో చేఋతున్నట్లు టీపీసీసీ, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి పేర్కొన్నారు.
నియంత లాగా పాలిస్తున్న కేసీఆర్ ను గద్దె దించి
తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం
పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ఆయన ఢిల్లీ లో అన్నారు.
బిఆర్ఎస్, బీజేపీ వ్యతిరేక శక్తుల రాజకీయ పునరికీకరణ జరగాలి. పౌర హక్కుల సంఘాలు, కులసంఘాలు, ప్రజాస్వామిక వాదులు అంత చేయి చేయి కలిపి బి.ఆర్.ఎస్ నియంతపాలనకు వ్యతిరేకంగా పోరాడాలి అని ఆయన పిలుపునిచ్చారు
రాజకీయ పునరికీకరణ ప్రజల్లో మొదలైంది. నాయకులు కూడా ముందుకొస్తున్నారు.కెసిఆర్ నియంతపాలనను తుదముట్టించడమే లక్ష్యంగా
ముందుకెళుతున్న కాంగ్రెస్ కు
మద్దతుగా నిలిచి గెలిపించాలని మల్లు రవి కోరారు.