గతంలో ఎక్కడదొరకని రాతిపూస
ఔత్సాహిక పరిశోధకుడు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ సిద్ధిపేట జిల్లా మండల కేంద్రం నంగునూరులో ఒక గ్రానైట్ ‘రాతి పూస’ను గుర్తించాడు. ఇంత వరకు పురావస్తు ప్రదేశాలలో టెర్రకోట(మట్టి)వి, రంగురాళ్ళతో(semi precious Stones) చేసినవి, ఎముకలతో చేసిన పూసలు లభిస్తు వచ్చా యి.
కాని, గ్రానైట్ రాతితో చేసిన రాతిపూస లభించడం తెలంగాణాలో ఇదే మొదటిసారి.
లభించిన పూసలు బంకమట్టితో చేసి కాల్చినవి, పగడం, లాపిస్ లాజులే, అగేట్, పచ్చవంటి విలువైన మణులతో చేసినవే తెలుసు ఇప్పటివరకు. ఈ రాతిపూస నంగునూరులో దొరకడం కొత్తవిశేషం. గతంలో నంగునూరు పాటిగడ్డమీద బంకమట్టితో చేసిన ఎద్దు తల, టెర్రకోట పూసలు వంటి పురావస్తువులెన్నో లభించాయి. ఇప్పుడీ రాతిపూస లభించింది. ఇది తొలి చారిత్రక యుగానికి అంటే క్రీ.శ. ప్రారంభానికి ముందరిదని పురావస్తు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. “గతంలో ఇదే పాటిగడ్డ వద్ద ప్రదేశంలో ఎద్దుతలకాయ మట్టి బొమ్మ, టెర్రకోట పూసలు దొరికాయి. ఇపుడు ఆభరణాలపూసలు దొరకడం విశేషం.ఇది చారిత్రిక యుగం తొలినాళ్ల నాటి పూస,” అని ప్రముఖ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.