తెలుగోళ్లకు  జాతీయ విద్యాసంస్థలు వద్దా

తెలుగు రాష్ట్రాలకు  జాతీయ విద్యాసంస్థలు వద్దా

– పాపని నాగరాజు

ఐఐటి, ఎన్‌ఐటి, త్రిబుల్‌ ఐటీ, ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థలలో దక్షిణ భారతదేశానికి అందులో తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ పార్లమెంట్‌ సభ్యులు నిలదీయాల్సిన అవసరం ఉంది.

అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాల సందర్భంగా కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు తప్ప నిజమైన ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం లేదు. అందులో విద్యారంగం ఒకటి. ఎన్‌ఐటి, ఐఐటి, త్రిబుల్‌ ఐటీ, సెంట్రల్‌ యునివర్శిటీలు, ఇతర జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో దాదాపు జాతీయ స్థాయిలో 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో తెలుగు రాష్ట్రాల నుండి విద్యార్థులు దాదాపు 3 లక్షల మంది అప్లికేషన్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ విద్యాసంస్థలను, విశ్వవిద్యాలయాలను, ఉన్నవాటిలో అ ద నపు సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది.

జాతీయ స్థాయి విద్యాసంస్థలను అధనంగా ఈ ప్రాంతానికి కెటాయించాల్సిన అవసరం ఏర్పడిరది. అంతే కాదు ఆ పెంచిన సీట్లలో ఓబిసి విద్యార్థులకు, ఎస్టి, ఎస్సి ఇతర వర్గాల విద్యాభివృద్ధి కోసం సీట్లను పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఈ దక్షణా ది, తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థలలో ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులను 75 శాతం భర్తి చేయడమే మేలు.

ఏ కారణం ఆధారంగా నంటే తెలుగు రాష్ట్రాల గురుకుల విద్యాసంస్థలలో రిజర్వేషన్ల అమలుతీరుగా చేయాల్సి ఉంది. 75 శాతం సీట్లు ఏ సామాజిక వర్గం గురుకులాలు ఉంటే అందులో ఆ విద్యార్థులకు కెటాయింపులు జరుగుతవి. మిగితా 25 శాతం వేరే సామాజికి వర్గాలకు, అనాథలు మరియు రిజర్వ్‌ చేయబడ్డాయి. 75శాతం పోగా మిగిలిన 25 శాతం స్థానికేతర విద్యార్థులతో నింపాలి. ఇప్పటి వరకు స్థాయికులకు 50 శాతం, స్థానికేతరులకు 50 శాతం సీట్ల కెటాయింపులు జరుగుతున్నవి. ఇది అసమగ్రం.

కనుక గురుకుల విద్యాసంస్థల అడ్మిషన్ల ప్రక్రియ విధానాన్ని ఐఐటి, ఎన్‌ఐటి, త్రిబుల్‌ ఐటీ, ఇతర జాతీయస్థాయి విద్యాసంస్థలలో అమలు చేయాలి. ఇందుకోసం రాష్ట్ర లేదా దక్షణాధి ఎంపిలు పోరాడాలి.

కేంద్ర ప్రభుత్వం ఒక సారీ సీట్లు పెంచుతుంది, తగ్గిస్తూంది. మరోక సారీ మిగిలిన ఆ సీట్లను మరోక సంస్తల్లో కలుపుతుంది. ఇలా కలపటంలో దక్షణాధి రాష్ట్రాల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వ్యతిరేకత దాగి ఉందని అర్ధం అవుతుంది. నేటి రాజకీయ నేతలు తమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారు. ని

జానికి తెలుగు రాష్ట్రాలలోని ఇంజనీరింగ్‌ విద్యలో లోపభూయిష్టంగా ఉంది. ప్రొఫెసర్లు, అసిస్టేంట్‌ ప్రొఫెసర్లు, అసొషియేట్‌ ప్రొఫెసర్లు లేరు. ల్యాబ్‌లు లేవు. ఉపాధినివ్వని తనం ఉంది. విద్యార్థులకు ప్రతిభా లేనితనం పెంచడంలో ఆ యోక్క విద్యా వ్యాపారస్తులు రోజు రోజుకు ఎక్కువ చేస్తున్నారు. వీరికి డబ్బే లక్ష్యం.

ఈ నేపథ్యలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు జాతీయ స్థాయి విద్యాసంస్థల పట్ల మక్కువైంది. ఐతే తెలుగు రాష్ట్రాల ఎంపీలు మరియు మంత్రులు ఈ ప్రాంత ఐఐటీ, ఎన్‌ఐటీ, త్రిబుల్‌ ఐటీలలో సీట్ల పెంపకానికి కృషి చేయడం లేదు.

ముఖ్యంగా ఓబీసీల విద్యార్థుల అప్లికేషన్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ పెరుగుతున్న దాని ప్రకారం రిజర్వేషన్‌ సిస్టంను మార్చాల్సిన అవసరం ఉంటుంది. అందుకు తగ్గట్టు 50 శాతం రిజర్వేషన్లు మించరాదని ఉన్న సుఫ్రీం కోర్టు సీలింగ్‌ను రద్దు చేస్తు పార్లమెంట్‌లో చట్టం చేసి రిజర్వేషన్స్‌ పెంచాలి. ఆ పెంచిన సీట్లలో కూడా జనరల్‌ కోటాలో ఓబీసీ పురుష, మహిళలకు వేరుగా పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళ కోటలో ఓబిసి మహిళ కోటను పెంచాలి. అప్పుడే సమగ్ర సామాజిక న్యాయం అవుతుంది. అనగా, జనాభా తగ్గట్టు రిజర్వేషన్లని పెంచాల్సిన అవసరం ఉంది. జాతీయ సంస్థల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్రకులాలకు ఇడబ్ల్యూఎస్‌ పేర సీట్ల కెటాయింపులు చేయడంలో ఓబిసి విద్యార్థులు అగ్రకుల పేద విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు వస్తేగానీ ఆ సంస్థల్లో సీట్లు సాధించుకునే అవకాశం రాదు. బ్రాహ్మణ, బనియ, ఇతర ధనిక వర్గాల ప్రయోజనాలని కాపాడే విధంగా కాకుండా పీడిత కులాల, వర్గాల ప్రయోజనాలని కాపాడే విధంగా తగు విధమైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత దేశంలోని అన్ని రకాల ఓబీసీ ఎంపీలపై ఉన్నది.

దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాష్ట్రాల పాలకుల ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతుంది. దీని పరివాసనమే కేంద్ర స్థాయి విద్యా, ఉద్యోగ రంగాల్లో ఈ ప్రాంత విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేలందరు కలసి ఉత్తరాధి, బ్రాహ్మణ మరియు బనియాల ఆధిపత్యాన్ని, నిర్లక్ష్యాన్ని, వ్యతిరేకతని ఎండ కట్టాల్సిన అవసరం ఉంది. మెజారిటీ సీట్లలో అగ్రవర్ణ ఉత్తరాది ప్రత్యేకతనే ఈ విద్యాసంస్థలలో మరియు ఉద్యోగ సంస్థలలో కనపడుతుంది, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రజలందరి ఐక్యతతో సమగ్ర సామాజిక న్యాయం కేంద్రంగా పోరాటాలను నిర్వహించల్సి ఉంది. ముఖ్యంగా విద్యార్థిలోకం అందుకు సన్నధ్దం కావాల్సి ఉంది.

 

 

 

 

 

 

(పాపని నాగరాజు, రాష్ట్ర అధ్యక్షులు,
కుల నిర్మూలన వేదిక, తెలంగాణ బహుజన విద్యార్థి సంఘం.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *