కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆధ్వర్యంలో చరిత్ర సదస్సు
రవీంద్రభారతిలో జూన్ 4వ తేదీన జాతీయ స్థాయి చరిత్ర సదస్సు
భాషా, సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సౌజన్యంతో
కొత్త తెలంగాణ చరిత్ర బృందం ‘తెలంగాణా చరిత్ర తొవ్వల్లో మనం-గమ్యం, గమనం’ అనే పేరుతో
చరిత్ర సదస్సును నిర్వహిస్తున్నది.
కీసరగుట్టలో ‘తొలుచువాండ్రు’ అనే తొలితెలుగు శాసనాన్ని రీడిస్కవర్ చేసిన కొ.తె.చ.బృందం సభ్యుడు కీ.శే. దీకొండ నర్సింగరావు పేరున ఏర్పరచిన సభా ప్రాంగణంలో సదస్సు జరుగుతున్నది. రవీంద్రభారతి సమావేశ మందిరం,
4వ జూన్ 2023న ఉ. 9.30గం.ల నుంచి సా.5.00గం.ల వరకు సభ జరుగుతుంది.
తెలంగాణ ప్రాక్చరిత్ర పితామహుడు ఠాకూర్ రాజారాం సింగ్ వేదిక సభాసమావేశాలు నిర్వహించబడుతున్నాయి.
ఆరంభ సభకు ముఖ్య అతిథిగా గౌ. శ్రీ వి. శ్రీనివాస గౌడ్, ఎక్సైజ్,క్రీడలు,యువజన సర్వీసులు,పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి తెలంగాణ ప్రభుత్వం, విచ్చేస్తున్నారు.
సభాధ్యక్షులుగా వేముగంటి మురళీకృష్ణ, కో-కన్వీనర్, కొ.తె.చ.బృం.,
సభలో ప్రొఫెసర్ ఎమెరిటస్, సంస్కృత అధ్యయన శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం అలోక్ పరాశర సేన్ గారు కీనోట్ సందేశం ఇస్తారు. ఈ సభలో సభాతిథులుగా
జూలూరు గౌరీశంకర్, అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమి,
మామిడి హరికృష్ణ, సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా,సాంస్కృతిక శాఖ,
సుద్దాల అశోక్ తేజ, సినీగేయకవి, జాతీయ అవార్డు గ్రహీత,
ఎం. వేదకుమార్, ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, ఐకోమాస్ సభ్యులు, Chairman, దక్కన్ హెరిటేజ్ ట్రస్టు
డా. బండి మురళీధర్ రెడ్డి, నాణకవేత్త, అధ్యక్షులు, సదస్సు పత్రసమర్పణ కమిటి, కొ.తె.చ.బృం.
ఎస్. రంగాచార్య, డిప్యూటీ డైరెక్టర్(రి), వారసత్వశాఖ, హైద్రాబాద్
విరువంటి గోపాలకృష్ణ, చరిత్రకారుడు, ఆలేరు, కొ.తె.చ.బృం.
కందకుర్తి యాదవరావు, చరిత్రకారుడు, కందకుర్తి
డా. దామరాజు సూర్యకుమార్, చరిత్రకారుడు, నకిరేకల్
డా. కుర్రా జితేంద్రబాబు, చరిత్రకారుడు, నడిగూడెం
డా. ఈమని శివనాగిరెడ్డి, సీఈవో, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, హైద్రాబాద్
శ్రీరామోజు హరగోపాల్, సదస్సు సంచాలకులు, కన్వీనర్, కొ.తె.చ.బృం. పాల్గొంటున్నారు.
ఈ చరిత్ర సదస్సులో 2,3,4,5 సెషన్సులుంటాయి. వీటిని కొత్త తెలంగాణ చరిత్రబృందం
కార్యనిర్వాహక కార్యదర్శులు బండి మురళీధర్ రెడ్డి, కట్టా శ్రీనివాస్, వేముగంటి మురళీకృష్ణ, బీవీ భద్రగిరీశ్ లు నిర్వహిస్తారు. సదస్సులో 20మందికి పైగా తమ చారిత్రక పరిశోధనలపై పత్రసమర్పణ చేయడానికి ఢిల్లీ, గుజరాత్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి, తెలంగాణ అంతట నుంచి డెలిగేట్లు వస్తున్నారు. కొత్త తెలంగాణ చరిత్రబృందం నిర్వహించే చరిత్ర సదస్సు జాతీయ సదస్సు.
తెలంగాణ చరిత్రపై జరిగే ఈ సదస్సును విజయవంతం చేయవలసిందిగా
శ్రీరామోజు హరగోపాల్ (సదస్సు సంచాలకులు) , బండి మురళీధర్ రెడ్డి, కట్టా శ్రీనివాస్, వేముగంటి మురళీకృష్ణ, బీవీ భద్రగిరీశ్ (కార్యనిర్వాహక కార్యదర్శులు, కొ.తె.చ.బృం) విజ్నప్తి చేశారు.