-రాఘవ శర్మ
ఎనభై ఆరేళ్ళ వయసు న్న ఒక మంచి విద్యా వేత్త , మరిచి పో లేని ఒక గురువును యాభై ఏళ్ళ తరువాత కలిస్తే ఎలా ఉంటుంది!?
“నేను రాఘవ శర్మ ను” అనగానే వెంటనే గుర్తు పట్టడం ఎంత ఆశ్చర్యమో, ఎంత ఆనందమో చెప్ప లేను.
మా ఇద్దరి లో ఏర్పడిన ఉద్వేగం
ఇద్దరి నీ ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఆయనే చంద్రమౌళి సార్.
హైదరాబాద్ బి ఎన్ రెడ్డి కాలనీ లో ఉంటున్నారు.
వనపర్తి పాలిటెక్నిక్ లో కామర్స్ లెక్చరర్ గా, డీ సీ పీ విభాగాధి పతి గా పనిచేశారు.
టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డులో డిప్యూటీ సెక్రటే రీ గా రిటైర్ అయ్యారు.
ఒక్క వనపర్తి పాలిటెక్నిక్ లో నే ఇరవై ఏళ్ళు పని చేశారు.
యాభై ఏళ్ళ తరువాత చూస్తే, ఆ వయసులో చంద్రమౌళి సార్ రూపు రేఖలు ఎలా ఉంటాయి !?
ఒకప్పుడు..
మనిషి తెల్లగా, కాస్త పొట్టిగా, నవ్వు ముఖంతో, చాలా చలాకీగా ఉండే వారు.
ఇప్పుడు..!
శరీరం శుష్కించింది. చాలా సన్న పడి పోయారు.
వినికిడి సమస్య ఏర్పడింది.
మంచం మధ్యలో తెల్లని పిట్ట లా కూర్చున్నారు.
నన్ను చూసే సరికి ప్రాణం లేచి వచ్చింది.
ఎదురుగా కూర్చుంటే , మంచం పైన తన పక్కన వచ్చి కూర్చో మన్నారు.
అదే కాలేజీ లో చేస్తున్న మా నాన్న తో చంద్రమౌళి సార్ కు మంచి స్నేహం.
మంచి స్నేహం మా నాన్న తో నేనా!?
ఆయన తో మంచి స్నేహం లేనిది ఎవరి తో!
అందరి తో నూ అదే మంచితనం.
ఆయన ఒక అజాతశత్రువు.
అది 1970-71. నేను టెన్త్ పరీక్షలు రాయాలి.
“మా వాడు ఇంగ్లీష్ లో వెనుక బడ్డాడు. కాస్త ఇంగ్లీష్ చెప్పండి ” అని అడిగాడు మా నాన్న.
అడిగిం దే తడువు గా పంపించ మన్నారు.
ఫీజు లేదు.
రోజూ రాత్రి భోజనం చేసి చంద్రమౌళి సార్ ఇంటికి వెళ్లేవా డిని.
నా ఒక్కడికే ఇంగ్లీష్ చెప్పేవారు.
రాత్రి వాళ్ళ ఇంట్లోనే వారి పిల్లల తో కలిసి పడుకుని పొద్దు న నే ఇంటికి వచ్చేసేవాడిని.
సాయంత్రం బ్యాంట్ మెంటెన్ ఆ డేవారు.
నేను కూడా ఆయనతో ఆడేవాడిని.
షాట్లు కొడితే ఇష్టం ఉండేది కాదు.
ఎంతసేపు అయినా సరే నిదానంగా ఆడాలనే వారు.
ఇంటర్ అయిపోయాక 1973 లో వనపర్తి వదిలేసి తిరుపతి వచ్చే సాము.
మళ్ళీ చంద్రమౌళి సార్ ను కలవ లేదు.
యాభై ఏళ్ళ తరువాత ఆయన్ని మళ్ళీ కలవడం ఇదే.
ఆ నాటి విషయాలు మా మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
” మా శర్మ కమ్యూనిష్టు ల్లో చేరి పోయాడు అన్నాడు మీ నాన్న గోపాల్ రావు.
చేరి తే ఏమ వు తుంది అన్నాను నేను ” అన్నారు నవ్వుతూ చంద్రమౌళి సార్.
” మా ఊరు నారాయణ ఖేడ్.
నేను ఉర్దూ మీడియం లో చదువు కున్నా ను.
నిజాం పాలన కదా, తెలుగు చెప్పే స్కూ ళ్ళు లేవు.
కన్నడం రాయడం వచ్చు.
తెలుగు రాయడం రాదు.
తరువాత తెలుగు రాయడం కూడా నేర్చు కున్నాను.
దాంతో ఉద్యోగం వచ్చింది.
తెలుగు రాయడం రాకపోతే ఉద్యోగం ఇచ్చే వాళ్ళు కాదు.
1966 లో వనపర్తి పాలిటెక్నిక్ లో డీ సీ పీ లెక్చరర్ గా చేరాను.
వనపర్తి లో 20 ఏళ్ళు చేశాను. ” అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ నాటి ఉద్యోగులను పేరు పేరు నా గుర్తు చేసుకున్నారు.
వారి నుంచి శెలవు తీసుకుని వచ్చేస్తుంటే “మీరు వచ్చి మాట్లాడారు కదా. ఆ మాటలతో మా నాయన ఆరు నెలలు ఆనందంగా గడి పేస్తారు” అన్నాడు చంద్రమౌళి సార్ చిన్న కుమారుడు పాండే.