*300 మంది పిల్లలు అరిగోస
*సరూర్ నగర్ ప్రాధమిక పాఠశాల మన ఊరు మన బడి పథకానికి ప్రోగ్రెస్ సున్నకు సున్న
– ఆకునూరి మురళి IAS retd ,SDF కన్వీనర్
ఈ రోజు సోషల్ డెమోక్రాటిక్ ఫోరమ్ టీం (ఆకునూరి మురళి కన్వీనర్ , prof లక్ష్మి నారాయణ SDF కో కన్వీనర్, Dr పృథ్వీ రాజ్ SDF కో కన్వీనర్) భూపేష్ గుప్తా నగర్ ప్రాధమిక పాఠశాల visit చెయ్యడం జరిగింది.
ప్రహారి గోడ కూలిపోవడం వల్ల, గోడ ఎత్తు తక్కువ ఉండడం, గోడ మీద ఫెన్స్ లేకపోడం మూలాన అసాంఘిక శక్తులు బడి లోపలికి వచ్చి మద్యం సేవించడం గంజాయి తాగడం రాత్రుళ్ళు తరగతి గదులలో పడుకోడం,గదులల్లోనే మూత్రం కాలకృత్యాలు తీర్చుకోడం చేస్తున్నారు.
స్కూల్ నిండా గాజుపెంకులు ఉండడం వల్ల పిల్లలకు గాయాలు అవుతున్నాయి. మరుగుదొడ్లు ఉన్న నీళ్లు లేకపోడం వలన పిల్లలు బడి ఆవరణలోనే బయట మూత్రం పోతున్నారు.
మనవూరు మన బడి పథకం లో సంవత్సరం క్రితం 14 లక్షలు మంజూరి అయినా కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు.
4 ఎకరాల స్థలం 300 మంది విద్యార్థులు ఉన్న ఈ బడి కి కనీసం 50 లక్షలు అవసరం పడతాయి.
పిల్లలందరూ కిందనే కూర్చుంటున్నారు. బడి ఆవరణ అంత చెత్త చెదారం గాజుపెంకులు. మరుగుదొడ్లు పనిచెయ్యడం లేదు,చాలా రిపైర్లు చెయ్యాలి, పెయింటింగ్ చెయ్యాలి.
మొదటి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో 3600 కోట్లు ఖర్చు పెడతామని 10 శాతం కూడా ఖర్చుపెట్టలేదు ఇప్పటి వరకు KCR గారు. విద్య మీద ప్రభుత్వ ప్రాధాన్యత ఎంత బాగుందో ఈ బడి చూస్తే తెలుస్తుంది.
ముఖ్యమంత్రి మొన్న వాళ్ళ మనవడి బడి ఓక్రిడ్జ్ స్కూల్ చూసినప్పుడు కూడా ప్రభుత్వ బడుల మీద ఆయన మనసు కరగలేదా !
మీ పిల్లలకు ఒక న్యాయం పేదపిల్లలకు ఒక న్యాయమా ?