BRS MLA పద్మారావు విధ్వంసం,
ప్రభుత్వ సొమ్ము కమిషన్ ల పాలు
– ఆకునూరి మురళి (IAS retd) SDF కన్వీనర్
ఈ రోజు సోషల్ డెమోక్రాటిక్ ఫోరమ్ టీం (ఆకునూరి మురళి కన్వీనర్ , prof లక్ష్మి నారాయణ సెక్రటరీ Save Education , Dr పృథ్వీ రాజ్ SDF కో కన్వీనర్) సీతాఫల్ మండి ZPHS స్కూల్ క్యాంపస్ సందర్శించారు.
అక్కడి బి ఆర్ ఎస్ MLA పద్మారావు (సికింద్రాబాద్) కొత్త జూనియర్ కాలేజీ భవనం ఫిట్ కండిషన్ లో ఉన్న బడి భవనం ను మొత్తం 27 గదులు కూలకొట్టించాడు.
కమిషన్ల కక్కుర్తి కై సీఎం రాష్ట్ర అభివృద్ధి ఫండ్ నుండి 29 కోట్లు మంజూరు చేయించుకున్నాడు. ఉన్న అన్ని గదులు మూడు భవనాలు రిపేర్ చేయించుకుంటే అన్ని వసతులు ప్లస్ కొత్త 14 గదులతో ఒక 5 కోట్లతో పూర్తి చేసుకుని ఉండొచ్చు.
కానీ కమిషన్ల కక్కుర్తి తో 29 కోట్లు మంజూరి చేయించుకున్నాడు.
టెండర్లు పిలవలేదు, కాంట్రాక్టర్ సెలెక్ట్ కాలేదు, కానీ తన మనుషులతో కట్టిద్దామని ప్లాన్ లో ఉన్నట్టు కనపడుతుంది.
బడి HM కి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కి కనీసం సమాచారం ఇవ్వకుండా బడి ని కూల్చెయ్యడం జరిగింది. ఇది అన్యాయం.
బడి అధికార అల్మారాలు, లైబ్రరీ అల్మారాలు, లాబోరోటరీ పరికరాలు ఉన్నా కానీ అలాగే బడి గదులను కూల్చడం దారుణం.
బడి,జూనియర్ కాలేజీ లను ఎక్కడ నుండి నడపాలో నిర్ణయం చెయ్యకుండానే కూల్చేసి విధానం ఏంటో అర్ధం కాదు.
అస్సలు పటిష్టమైన భవనాలను కూల్చేసే పాలసీ ఏంటి అని SDF ప్రభుత్వాన్ని అడుగుతున్నది.
విద్య పట్ల ఈ దుర్మార్గపు ధోరణి ని SDF & Save Education ఖండిస్తోంది