ఇక ఇన్ స్టంట్ కాఫీ కలుపుకున్నంత ఈజీ గా మీరు కూడా మీకిష్టమైనపుడల్లా చిల్డ్ బీర్ కలుపుకుని ఆస్వాదించవచ్చు. దీనికోసం బీర్ పౌడర్ వచ్చేసింది. గతంలో ‘కింగ్ ఫిషర్ బీర్ పౌడర్’ ను తయారు చేసినా అదేమంత స క్సెస్ కాలేదు. ఇపుడు జర్మనీకి చెందిన క్లోస్టర్ బ్రావరై నోయ్ జెల (Klosterbraurei Neuzelle) అనే సంస్థ అద్భుతమయిన బీర్ పౌడర్ తయారు చేసింది. విడుదల చేసింది.
ఇది రుచిలో సాధారణ బీర్కంటే ఏ మాత్రం తీసిపోదని తేలింది. మరొక విషయం ఏంటంటే ఇది జీరో ఆల్క హాల్ బీర్ . కాకుంటే హై డెక్స్ ట్రిన్ (HighDextrin) బీర్. దీనిని మామూలు పద్దతిలోనే ప్రాసెస్ చేసి పౌడర్ గా, కణికలుగా తయారు చేశారు. ఇది చక్కగా నీళ్లలో కరుగుతుందని ఇంటెరెస్టింగ్ ఇంజినీరింగ్ (Interesting Engineering) రాసింది.
దీనిని జర్మన్ ప్రభుత్వసహకారంతో తయారు చేశారు. దీనికి టెక్నాలజీ అందించిన కంపెనీ పేరును మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. తక్కువ సమయంలో, తక్కువ ముడి పదార్థాలను ఉపయోగించి బీర్ ను ప్రాసెస్ ను తయారు చేసే టెక్నాలజీని రూపొందించడంలో ఈ కంపెనీ విజయవంతమయింది. ప్రస్తుతానికి చిన్నమోతాదులో ఈ బీర్ పౌడర్ ను మార్కెట్ చేయాలనుకుంటున్నారు. 2023 ఉత్తరార్ధంలో భారీ మార్కెటింగ్ ఉండవచ్చు.
తొందరలోనే భారీ ఉత్పత్తి ప్రారంభించి, ఆల్కహాలిక్ వర్షన్ ను కూడా తయారుచేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
బీర్ పౌడర్ తో రవాణా సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. భూమ్మీద మూలమూలకు బీర్ పౌడర్ ను సరఫర చేయవచ్చు.బీర్ ద్రవరూపంలో ఎగుమతి చేయడం ఆసియా దేశాలలో బాగా ఖరీదైన వ్యవహారం. పౌడర్ ని ఆ ఖర్చులో కేవలం 10శాతంతో ఎగుమతి చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది ఒక విధంగా పర్యావరణ అనుకూల విషయమని కూడా వారు చెబుతున్నారు. ” బీరు లో ఉండేదంతా నీళ్లే కదా. బీర్ ఎగుమతి పేరుతో ఈ నీళ్లని ప్రపంచ దేశాలకు కోటానుకోట్ల డాలర్లు ఖర్చుపెట్టి ఎగుమతి చేస్తూవచ్చారు. ఇదే ఆశ్చర్యం. ఈ నీళ్లెక్కడయినా దొరుకుతాయి. అందువల్ల బీర్ పౌడర్ ను అందిస్తేసరిపోతుంది. దీనిని సులభంగా పెద్దగా ఖర్చు లేకుండాఎగుమతి చేయవచ్చు,” అని కంపెనీ సంబర పడుతున్నది.
బీర్ పౌడర్ తో రవాణా సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ప్రతి మూలమూలకు బీర్ పౌడర్ ను సరఫర చేయవచ్చు.బీర్ ద్రవరూపంలో ఎగుమతి చేయడం ఆసియా దేశాలలో బాగా ఖరీదైన వ్యవహారం. పౌడర్ ఆ ఖర్చలో కేవలం 10శాతంతో ఎగుమతి చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది ఒక విధంగా పర్యావరణ అనుకూల విషమని కూడా వారుచెబుతున్నారు. ” బీరు లో ఉండేదంతా నీళ్లే కదా. బీర్ ఎగుతి పేరుతో నీళ్లని ప్రపంచదేశాలకుకోటానుకోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంటే ఆశ్చర్యం. ఈ నీళ్లెక్కడా దొరుకుతాయి. బీర్ పౌడర్ ను సులభంగా పెద్దగా ఖర్చు లేకుండాఎగుమతి చేయవచ్చు,” కంపెనీ సంబర పడుతున్నది.
ఈ బీర్ తయారు చేసిన క్లోస్టర్ బ్రావరై నోయ్ జెల అనే జర్మనీ కంపెనీకి ఆసక్తికరమయిన చరిత్ర ఉంది. ఇది ఒక క్రైస్తవ మఠంలో ఉంటుంది. యాంటి ఎజింగ్ (Anti-Aging-Bier)ను తయారు చేస్తుందని పేరుంది. అంతేకాదు, ఈ కంపెనీ గత 400 సంవత్సరాలుగా బీర్ ను తయారు చేస్తూ ఉంది. బీరు తయారీలో వాడే నాలుగు ప్రధాన ముడిపదార్థాలతో పాటు ఈ కంపెనీ బీరు లో స్పైర్యులనా (Spirulina), ఫ్లేవనాయిడ్స్ ( flavonoids)కూడా ఉంటాయి. వీటి బీరులో యాంటాక్సి డెంట్స్ ఎక్కువగా ఉంటాయని, ఆవి ఆరోగ్యాన్నిచ్చి జీవితకాలాన్నిపెంచుతాయని చెబుతారు.