న్యాయ రాజధాని: వైసీపీ విశ్వసనీయతకు పరీక్ష

రాయలసీమకు న్యాయ రాజధాని హామీ విషయంలో వైసీపీ విశ్వసనీయతకు పరీక్ష.

11 న KRMB బోర్డు సమావేశంలో కార్యాలయ మార్పు అజెండా ఉన్నందున సీమ ఆత్మగౌరవ నినాదంతో , గర్జనలు చేసిన వైసీపీ MLA , MP లు తమ నిజాయితీని నిరూపించుకోవాలి.

చరిత్రలో తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి స్థానాన్ని పధికాలాలు పాటు వారి స్థానాన్ని నిర్ణయిస్తుంది. మూడు రాజధానుల పేరుతో వైసిపి ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పింది. హైకోర్టు తీర్పు అందుకు ఆటంకంగా మారడంతో సుప్రీం కోర్టులో SLP దాఖలు చేశారు. రాయలసీమకు న్యాయ రాజధాని ప్రతిపాదనలో హైకోర్టుతో బాటు న్యాయ స్వభావం కలిగి ఉన్న కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీభాగ్ అవగాహనను గౌరవిస్తామని కూడా ప్రకటించారు. నిజానికి శ్రీభాగ్ అవగాహన మేరకు రాయలసీమలో ఉండాల్సినది హైకోర్టు కాదు రాజధాని. కానీ ఇప్పుడు కనీసం హైకోర్టు ఇతర న్యాయ స్వభావం కలిగి ఉన్న కార్యాలయాలు అయినా రాకపోతాయా అన్న చిన్న ఆశ రాయలసీమ ప్రజలది. ఆ ఆశతోనే రాజకీయాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరిచినాము. కానీ వైసీపీ ప్రభుత్వం ఏమి చేస్తోంది.


నేడు మంగళగిరిలో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ ప్రారంభం.

ఏపీ జ్యుడీషియల్ అకాడమీని నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే రాష్ట్ర న్యాయాధికారుల సమావేశంలోనూ సీజేఐ పాల్గొననున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరుకున్న ఆయనను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బెజవాడ దుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్శించుకున్నారు.


KRMB ని విశాఖలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన అభ్యంతరకరం.

విభజన చట్టం ప్రకారం కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం ఏపీకి వస్తుంది. ఏపీ ప్రభుత్వం ఎక్కడ పెట్టమని సిఫార్సు చేస్తే బోర్డు కార్యాలయం అక్కడ ఏర్పాటు జరుగుతుంది. బోర్డు పని ఏపీ తెలంగాణ మధ్య వచ్చే జల వివాదాలను పరిష్కరించడం అంటే న్యాయ స్వభావం కలిగి ఉన్న కార్యాలయం. కృష్ణా , తుంగభద్రలకు మరియు ఏపీ , తెలంగాణకు మధ్యలో కర్నూలు ఉంటుంది. అన్నింటి కన్నా మించి న్యాయ స్వభావం కలిగి ఉన్న కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేస్తామని మూడు రాజధానుల ప్రతిపాదనలో పొందుపరిచారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఒక లేఖతో కర్నూలుకు క్రిష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం రాయలసీమకు వచ్చే అవకాశం ఉంటే దాన్ని ఏపీ ప్రభుత్వం నిరాకరించడం నదికి ఎలాంటి సంబంధం లేని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ ప్రజల నుంచి ఎన్ని సార్లు వినతులు వచ్చినా పట్టించుకోకుండా ముందు వెళ్లడం అన్యాయం , అప్రజాస్వామిక చర్య కూడాను.

 

11న బోర్డు సమావేశంలో KRMB కార్యాలయ మార్పు అజెండా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ MLA , MP లు తమ నిజాయితీని నిరూపించుకోవాలి.

రాయలసీమకు రాజధాని విషయంలో చారిత్రకంగా అన్యాయం జరిగిందని దాన్ని సరిదిద్దే ఉద్దేశ్యంలో భాగంగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ప్రజల మద్దతు ఇవ్వాలని రాయలసీమ ఆత్మగౌరవ నినాదంతో వైసీపీ MLA , MP లు ఇతర నేతలు గర్జనలు చేశారు. 11న జరగబోయే KRMB బోర్డు సమావేశంలో కార్యాలయం మార్పు అజెండా ఉన్నది సహజ న్యాయసూత్రాలను పరిగణనలోకి తీసుకున్నా మీ పార్టీ రాయలసీమ ప్రజలకు ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకున్నా KRMB కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విశాఖలో కార్యక్రమం.ఏర్పాటు చేయాలని లేఖ ఇచ్చిఉన్నది సమావేశం జరిగే 11 లోపు రాయలసీమకు చెందిన వైసిపి MLA , MP లు ముఖ్యమంత్రితో మాట్లాడి కర్నూలులో కార్యాలయం ఏర్పాటు చేయాలని లేఖ ఇవ్వాలి లేని పక్షంలో ప్రభుత్వ అభిమతం మేరకు కార్యాలయం విశాఖకు తరలిస్తారు. ఒక లేఖతో రాయలసీమకు కార్యాలయం వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వని వారు హైకోర్టు తెస్తాము అంటే ఎలా నమ్మాలన్న ప్రశ్నలు తలెత్తుతాయి.

ఏపీ ప్రభుత్వం తక్షణమే విశాఖపట్నంలో KRMB కార్యాలయం ఏర్పాటు చేయాలని బోర్డుకు ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుని న్యాయస్వభావం కలిగి ఉన్న కార్యాలయాలను రాయలసీమ లో ఏర్పాటు చేస్తామన్న హామీని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో కార్యాలయ ఏర్పాటు చేయాలని కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖను ఇవ్వాలని రాయలసీమ ప్రజలతరపున డిమాండ్ చేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *