బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా ‘లక్కీ లక్ష్మణ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈవెంట్లో బిగ్ టికెట్‌ను డైరెక్టర్ అభి తండ్రి గంగిరెడ్డి ఆవిష్కరించి సోహైల్ తండ్రి సలీమ్‌కి అందించారు.
పరిమితమైన బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాలకు సంబంధిచి లక్కీ లక్ష్మణ్ టీమ్ ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. కొరమీను టీమ్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆహ్వానించారు. ఎందుకంటే డిసెంబర్ 31న కొరమీను సినిమా రిలీజ్ అవుతుంది. ఒకరికొకరు సపోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే సరికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం పలికాయి. ఈ సందర్భంగా కొరమీను సినిమా హీరో ఆనంద్ రవి, హీరోయిన్ కిశోరి ధత్రిక్.. లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథులుగా విచ్చేసి లక్కీ లక్ష్మణ్ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని విషెష్ తెలిపారు. ఈ సందర్భంగా…
హీరో సోహెల్ మాట్లాడుతూ.. ‘నేను ఈ స్థాయికి రావడం తెలుగు ప్రజలు. ప్రతీ సక్సెస్ మెన్ వెనుక ఉమెన్ ఉంటుందని అంటారు. కానీ నా సక్సెస్ వెనుక మా నాన్న ఉన్నాడు. నాకు వచ్చిన డబ్బుల్లో కొంత సాయం చేయడమే నాకు తెలుసు. నాకు సినిమా తప్పా ఇంకోటి తెలీదు. మా నిర్మాత హరిత గారు ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ అభి ఎంతో కష్టపడ్డారు. సినిమా కంటెంట్‌ను నమ్మి చేస్తున్నామని డైరెక్టర్ ఎప్పుడూ చెబుతూనే వచ్చారు. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. సినిమాలో నటించిన రాజా రవీంద్ర, దేవీ ప్రసాద్, షానీ అన్న ఇలా అందరికీ థాంక్స్. తెలుగు ప్రజలే నా ధైర్యం. మీరే నా సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అనూప్ అన్న మంచి సంగీతాన్ని అందించారు. ఆండ్రూ గారి కెమెరా వర్క్ బాగుంది. హరిత గారు డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నవ్వుతారు, ఏడుస్తారు. డిసెంబర్ 30న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
డైరెక్టర్ అభి మాట్లాడుతూ.. ‘మనలో ప్యాషన్ ఉంటే ఏదైనా చేయగలం. కాస్త ఆలస్యం అవుతుందేమో గానీ రావడం మాత్రం పక్కా. తప్పు చేస్తే చెప్పి చెయ్ అని మా నాన్న గారు చెబుతుంటారు. ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం. సినిమా గురించి ఇప్పుడు నేనేం మాట్లాడను. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు. ఈ సినిమా చేద్దామని అనుకున్న తరువాత సోహెల్‌ను కలిశాం. ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథ ఓకే చెప్పాడు. ఇకపై నా సినిమాలన్నింటికి కెమెరామెన్‌గా ఆండ్రూ సారే ఉంటారు. అనూప్ సర్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. ప్రవీణ్ ఎడిటింగ్, భాస్కరభట్ల పాటలు అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ సినిమాలోని ప్రతీ పాత్రకు సెకండ్ చాయిస్ లేదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. అందరూ కథ విన్న వెంటనే కారెక్టర్లకు ఓకే చెప్పారు. మోక్ష చాలా బాగా నటించారు. ఆమె పాత్రతో అందరూ ప్రేమలో పడతారు. సోహైల్ ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్ నాకు తెలుసు. కానీ ఎంత మందికి సాయం చేస్తారో మీకు తెలీదు. అవుట్ సైడ్ కాదు ఇన్ సైడ్ కూడా బ్యూటీఫుల్. నేను ఏం చేయలేను.. దేనికి పనికి రాను అనే సమయంలో హరిత నన్ను నమ్మంది. నాది లక్కీ కాదు.. అంతకు మించి. ప్రతీ క్రాఫ్ట్‌లో హరిత ఇన్వాల్వ్ అయింది. ఆమె ఓ మంచి నిర్మాత. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడ్డారు’ అని అన్నారు.
నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. ‘ఈ రోజు మేం ఇక్కడ ఉన్నామంటే ఆ భగవంతుడి దయ. నేను ఏ పని చేసినా దైవంగానే భావిస్తాను. పనే దైవంగా భావిస్తుంటా. ఏం చేసినా కూడా అదే నమ్ముతాను. అభికి చిన్నతనం నుంచి డైరెక్షన్ పిచ్చి ఉంది. ఎప్పుడైనా ఆపేస్తాడేమో అనుకున్నాను. డైరెక్షన్ చేయాలనే కోరిక ఉందని నాకు అర్థమైంది. చిన్నతనంలో నా కోరికలేవీ తీరలేదేమో గానీ.. అభి తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికను తీర్చాలని అనుకున్నాను. అందుకే మా ప్రతీ చెమట చుక్కని డబ్బుగా మార్చి ఈ సినిమాను తీశాం. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా ఇది మాకు చాలా పెద్ద సినిమా. కంటెంట్ ఉన్న మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా మా టీం వల్లే సాధ్యమైంది. ఈ సినిమాలో డైరెక్టర్ గారి రైటింగ్ అద్భుతంగా ఉంది. సోహైల్ చాలా మంచి అబ్బాయి. ఎంతో కష్టపడతాడు. కాస్త షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. మనిషి కదా? అన్ని ఎమోషన్స్ ఉండాలి. సోహెల్ మంచి నటుడు. సోహెల్ పక్కా హీరో పీస్. మేం చేసిన పనిని గుర్తించండి’ అని అన్నారు.
హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. ‘నాకు ఎంతో మాట్లాడాలని ఉంది. కానీ మాట్లాడలేకపోతోన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు థాంక్స్. రాక్ స్టార్ సోహైల్‌కు థాంక్స్. వీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను తెలుగు అమ్మాయిని కాదు. కానీ ఇప్పుడు ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ టాప్‌లో ఉంది. అలాంటి ఇండస్ట్రీలో నాకు అవకాశం ఇచ్చారు. సోహైల్ గత పదేళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు. నేను ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. ఇది మా మొదటి సినిమా. అందరూ చూసి మా సినిమాను సక్సెస్ చేయండి. జయహో తెలుగు సినిమా’ అని అన్నారు.
జుబేదా అలీ మాట్లాడుతూ.. ‘సోహైల్ నా తమ్ముడులాంటి వాడు. ఈ సినిమా డిసెంబర్ 30న రాబోతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా ఆయన అలీ కూడా ఇక్కడకు రావాల్సి ఉంది. కానీ ఆయన షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ఈ సినిమాను ఆడియకెన్స్ ఆశీర్వదించాల’ని కోరుకుంటున్నాను.
కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ‘సోదరి హరిత కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. డైరెక్టర్ అభి కూల్‌గా కనిపిస్తాడు. కానీ రాక్షసుడు. తనకి ఏం కావాలో వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటాడు. సోహైల్ ఎప్పుడూ ఎలక్ట్రిక్ పవర్‌లా ఉంటాడు. చిన్న పవర్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించినట్టు అనిపిస్తుంది. అగ్రజులు దేవీ ప్రసాద్ వంటి వారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. లక్కీ లక్ష్మణ్ మా అందరికీ లక్కీగా మారుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలు అభి, హరితలకు థాంక్స్. దర్శక నిర్మాతలు ఇద్దరూ భార్యాభర్తలవ్వడం లక్కీ. వారిద్దరికీ కలిసొచ్చే అంశం. డైరెక్టర్ అభికి వాళ్ల నాన్న అంటే ఇష్టం. అమ్మనాన్నలను ప్రేమించే వాళ్లు, కుటుంబ బాధ్యతను తీసుకునే వారికి మంచి మనసు ఉంటుంది. అలాంటి మంచి మనసు వాళ్లు రాసే రచనల్లో కనిపిస్తుంది. లక్కీ లక్ష్మణ్లోనూ అలాంటి ఎన్నో సీన్లున్నాయి. దర్శకుడికి మంచి పేరు, నిర్మాతకు డబ్బులు రావాలి’ అని అన్నారు.
కొరమీను హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. ‘మా సినిమాలు పోటీలో దిగుతున్నా కూడా ఇలా ఆరోగ్యకరమైన వాతావరణంతో మమ్మల్ని పిలిచినందుకు ఆనందంగా ఉంది. లక్కీ లక్ష్మణ్ ట్రైలర్ చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 30న రాబోతోంది’ అని అన్నారు.
కొరమీను హీరోయిన్ కిశోరి ధత్రిక్ మాట్లాడుతూ ‘ముందుగా లక్కీ లక్కీ లక్ష్మణ్ టీమ్‌కు కంగ్రాట్యులేషన్స్. సోహైల్గారి క్రేజ్ చూస్తుంటే మామూలుగా లేదు. థియేటర్స్‌కు వెళ్లి డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ సినిమాను చూడండి. అలాగే డిసెంబర్ 31న మా కొరమీను సినిమాను చూసి ఆశీర్వదించండి. థాంక్యూ..’’ అన్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘సోహైల్‌ను ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలోకి ఇప్పుడు మేం అధికారికంగా స్వాగతిస్తున్నాం. మోక్షది పాజిటివ్ స్మైల్. లక్కీ స్మైల్. నిర్మాతగా హరిత ఆసక్తిని చూస్తుంటే మున్ముందు మరిన్ని సినిమాలు చేసేలా ఉంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. డైరెక్టర్ అభి ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను చేసినట్టుగా కనిపిస్తోంది. నా బ్రదర్ అనూప్ మ్యూజిక్ చేశాడు కాబట్టి ఎలాగూ బాగానే ఉంటుంది. సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘నిర్మాత హరిత గారు మొదటి సినిమా చేస్తున్నారు. సోహైల్‌తో మా సినిమా ప్రొడక్షన్ స్థాయిలో ఉండగానే ఈ చిత్రం మొదలుపెట్టేసి.. అనుకున్న టైంలో ఫినిష్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆమె చేసిన ఈ మొదటి సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మొదటి సినిమా రిలీజ్ అవుతుంటే ఉండే ఆ పెయిన్ నాకు తెలుసు. డైరెక్టర్ అభి ఎక్కువగా లవ్ స్టోరీస్ చేశాడు. ఈ సినిమాలో రైటింగ్ బాగుంది. ఈ సినిమా ఆయనకు హిట్ అవ్వాలి. ఆయనకు ఆల్ ది బెస్ట్. సోహైల్ కచ్చితంగా స్టార్ అవుతాడు. స్టార్ అయ్యే ప్రయత్నంలో ఆయన పడే కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. లక్కీ లక్ష్మణ్ అనేది ఆయనకు మొదటి సినిమా. ఇది కచ్చితంగా ఆయనకు మంచి పేరును తీసుకొస్తుంది. హీరోయిన్ మోక్ష నటన చాలా బాగుంది. అనూప్ రూబెన్ మ్యూజిక్ బాగుంది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 30న ఆడియెన్స్ సినిమాను చూసి ఆదరించాలి’ అని కోరుకున్నారు.
సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘లక్కీ లక్ష్మణ్ ఈవెంట్ చూస్తుంటే.. నాకు నా మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ల హవా నడుస్తోంది. డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ చూడండి. డిసెంబర్ 31న కొరమీను చూడండి.. అదే రాత్రి పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కూడా చూడండి’ అని అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘ఇది సోహైల్ మొదటి సినిమా. ఆయన ఎనర్జిటిక్ స్టార్. ఫస్ట్ సినిమాకే ఇంత మంది అభిమానులు ఉన్న హీరోను ఇదే మొదటి సారి చూస్తున్నా. సోహైల్‌కు ఈ అభిమానులు చాలా అవసరం. దర్శక నిర్మాతల కాంబినేషన్ చాలా బాగుంది. ఇంత ప్యాషన్ ఉన్న వారిని చాలా అరుదుగా చూస్తాం. అనూప్ మ్యూజిక్ ఇరగదీశాడు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
ఇనయ మాట్లాడుతూ.. ‘లక్కీ లక్ష్మణ్‌కు కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్. నిర్మాత హరితకు నాకు మంచి ఫ్రెండ్. డైరెక్టర్ అభి, హీరో సోహైల్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమాను ఆడియెన్స్ చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మెహబూబ్ మాట్లాడుతూ.. ‘సోహైల్ పదమూడేళ్లుగా సినిమా సినిమా అని పరితపిస్తూనే ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి కచ్చితంగా సక్సెస్ రావాలి. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఓట్లు వేస్తూనే వచ్చారు. వారంతా సినిమా చూస్తే సినిమా హిట్ అవుతుంది. మోక్ష చక్కగా నటించారు. నిర్మాత హరిత గారికి, డైరెక్టర్ అభికి ఆల్ ది బెస్ట్. మంచి సినిమాను తీశారు’ అని అన్నారు.
సమీర్ మాట్లాడుతూ.. ‘లక్కీ లక్ష్మణ్ చాలా మందికి మొదటి సినిమాను. హీరో హీరోయిన్ నిర్మాత దర్శకులు ఇలా అందరికీ ఇది మొదటి సినిమానే. ఫస్ట్ అనేది ఎప్పుడూ బెస్టే. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కూడా బెస్ట్ అని అంతా ఒప్పుకుంటారు. ఈ సినిమాలో నేను చిన్న పాత్రను పోషించాను. క్యూట్ కపుల్ (దర్శకనిర్మాతలు) తీసిన చిన్న లవ్ స్టోరీ. నాకు చాలా నచ్చింది. నా దృష్టిలో బిగ్ బాస్ సోహైల్ అసలు విన్నర్. ఈ సినిమా డిసెంబర్ 30న రాబోతోంది. అందరూ సినిమాను చూడండి’ అని అన్నారు.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ‘నో వేర్ టు సమ్ వేర్ అనే డైలాగ్‌కు సోహైల్ ప్రతిబింబంలా అనిపిస్తుంది. అతనికి సినిమా అనే పిచ్చి ఉంది. నిర్మాత హరిత గారికి బాగా డబ్బులు రావాలి. సినిమా మంచి విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.