తెలంగాణా లో కౌలు రైతుల స్థితి గతులపై అధ్యయన నివేదికను రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ రోజు విడుదల చేశారు.
రాష్ట్రంలో 20 జిల్లాలలో 31మండలాలలో 35 గ్రామాలలో ఇంటింటి సర్వే ఆధారంగా ఈ అధ్యయనం సాగింది.
అందరి అంచనాలకు భిన్నంగా రాష్ట్ర సాగు దారులలో 35 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని ఈ అధ్యయనం బయట పెట్టింది.
ఈ సమావేశానికి రైతు స్వరాజ్య వేదిక నాయకులు ఆశాలత అధ్యక్షత వహించారు. అందరికీ RSV నాయకులు కొండల్ స్వాగతం పలికారు. వివిధ జిల్లాల నుండీ వచ్చిన కౌలు రైతులు సమావేశంలో మాట్లాడారు. అధ్యయన నివేదిక వివరాలను విస్సా కిరణ్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అధ్యయన ఉద్దేశ్యాన్ని , సర్వే నిర్వహించిన పద్ధతిని కన్నెగంటి రవి చెప్పారు.
సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డి.నరసింహా రెడ్డి , రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గోపాలరావు,మురళి, TJS పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, BSP నాయకులు దయాకర్, అరుణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట నీలిమ, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్, తెలంగాణా విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య, దళిత బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి పి.శంకర్, వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నాయకులు వెంకటయ్య, TPTF నాయకులు రఘునందన్, తెలంగాణా రైతాంగ సమితి అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, మకాం నాయకులు ఉషా సీతా లక్ష్మి, NAPM నాయకులు మీరా సంఘమిత్ర, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కిరణ్ కుమార్,రవి కన్నెగంటి,బి.కొండల్, హర్ష తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాపితంగా వివిధ సంస్థలు కూడా ఈ అధ్యయనం లో పాల్గొన్నాయి. మొత్తం 120 మంది వాలంటీర్లు ఫోన్ app ఆధారంగా రెండు నెలల పాటు 7744 మంది రైతులను సర్వే చేశారు.
ఇటీవలి కాలంలో తెలంగాణా వ్యవసాయ రంగంలో జరిగిన ముఖ్యమైన అధ్యయనం ఇది.
2022 జనవరి, ఫిబ్రవరి నెలలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కూడా రైతు స్వరాజ్య వేదిక కౌలు రైతుల పై అధ్యయనం చేసింది. మార్చ్ 7 న విజయవాడ లో నివేదిక విడుదల చేసింది.
రైతు స్వరాజ్య నాయకులు మంగమ్మ, రాములు, కరుణాకర్, నర్సింహ, సాగరిక తదితరులు కార్యక్రమం లో పాల్గొన్నారు.