విజయ్ దేవరకొండను (Vijay Deverakonda) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈడీ డిపార్ట్మెంట్కి విజయ్‌కి ఏంటి సంబంధం?
వివరాల్లోకి వెళితే … విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లైగర్. ఆగస్ట్ 25న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా వల్ల చాలా నష్టపోయామనిని డిస్ట్రిబ్యూటర్స్ గొడవ చేశారు. అది వివాదంగా ఏమైందో ఏమో కానీ.. కొత్త వివాదం వచ్చింది. లైగర్ సినిమా నిర్మాణంలో పెట్టుబడుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో వారుచిత్ర యూనిట్‌కి నోటీసలుచ్చి విచారణకు పిలిచారు.
ఇప్పటికే దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్‌తో పాటు సినిమాలో మరో నిర్మాతగా ఉన్న ఛార్మి కూడా విచారణకు హాజరైంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హాజరయ్యారు. సినిమా నిర్మాణంలో పెట్టిన డబ్బులను ఇక్కడి నుంచి దుబాయ్‌కి (Dubai) పంపి, అక్కడి నుంచి దాన్ని ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేసి నిర్మాణంలో పెట్టినట్లు ఈడీ బృందం అనుమానిస్తోంది. మంగళవారమే విజయ్ దేవరకొండ విచారణకు వెళ్లారు. తర్వాత ఈరోజు కూడా వెళ్లారు. మరి ఈడీ అధికారులు ఇతన్ని ఏమని ప్రశ్నించారనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇక లైగర్ సినిమాను మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీ అనన్య పాండే హీరోయిన్ గా చేసింది. మాజీ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ చిత్రంలో నటించారు. ఆగస్ట్ 25న పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కనీస వసూళ్లను కూడా సాధించలేకపోవటంతో పెద్ద దెబ్బ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్ష్ భారీగా నష్టపోవటమే ఇబ్బందిగా మారింది.