అంతమైపోతు మంచాన పడ్డది ప్రశ్న

సీమ రాజులను తరుమ
చిచ్చరపిడుగైంది ప్రశ్న
ఆంధ్ర దొరలను తరుమ
అణు బాంబై పేలింది ప్రశ్న
సొంత రాష్ట్రంలోన
అంతమైపోతు
మంచాన పడ్డది ప్రశ్న
ఎందుకో ఏమో ఏడుస్తున్నవే ప్రశ్న
ఎవ్వరేమన్నారు చెప్పేవే ప్రశ్న

పదవి ఆశలొ రాజు
పాదాలు ముద్దాడి
పంచన చేరింది ప్రశ్న
నమ్మిన జనమును
నట్టేట ముంచి
వంచన చేస్తుంది ప్రశ్న
Xఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి
బానిసగా మారింది ప్రశ్న
బ్రమలొ పడ్డదొ గాని
భయపడ్డదొ గాని
బందియై పోయింది ప్రశ్న

పాపాల కిరీటాన్ని తల మీద
ధరించి ఊరేగుతున్నది ప్రశ్న
చంచాగిరి పోటిలో
పరుగెత్తి పరుగెత్తి
అలసి పోయిందేమో ప్రశ్న
పైరవి పందెంలో
పరుగెత్తి పరుగెత్తి
పల్చబడి పోయింది ప్రశ్న
పవరు తగ్గిపోయి
పక్షవాతమొచ్చి
మంచాన పడ్డది ప్రశ్న
దొరల గడీలల్లొ
చెక్క భజన చేస్తు
బందియైపోయింది ప్రశ్న

ప్రశ్నించే తత్వాన్ని
కోల్పోయినట్లైతే
నీవెట్ల అయితావు ప్రశ్న
జన ప్రభంజన సునామివై
నవ తాండవమాడాలి ప్రశ్న
జనం పక్షాన నిలవాలి ప్రశ్న
ప్రశ్నించే శరీరాన్ని
ముక్కులు ముక్కలుగా నరుకొచ్చు
కాని ప్రశ్నను చంపలేరు
ఒక్క ప్రశ్నను చంప చూస్తే
వేలాది ప్రశ్నలకు మీరే జవాబుదారులు..

-రాంచందర్ భీంవంశీ,
వాగ్గేయకారులు
జహీరాబాద్ 9951619119

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *