రాయలసీమ నామకరణ దినోత్సవం (రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం)ను రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో గుత్తి పట్టణంలోని మహాత్మ జూనియర్ కళాశాల లో సదస్సు నిర్వహించారు
ఈ సందర్భంగా రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు వై.రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ
నైజాం నవాబు తమ ప్రాంతం భద్రతకై ఏర్పాటు చేసుకున్న బ్రిటిష్ సైనిక దళాల ఖర్చుకు బదులుగా నేటి రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటీష్ వారికి వదిలి వేయడం జరిగింది. బ్రిటిష్ వారికి వదలివేయబడిన ప్రాంతంను ఆంగ్లంలో సీడెడె డిస్ట్రిక్ట్స్ అని పిలిచేవారు. ఆంగ్లంలో సీడెడ్ అంటే ఇచ్చివేసిన, వదలివేయబడిన ప్రాంతం అని తెలుగులో అర్థం. ఈ అర్థంతో కాకుండా ఈ ప్రాంతంను దత్తమండలాలుగ వ్యవహరించే వారు. కాని ఈ ప్రాంతం ఎప్పుడు “దత్తపుత్రడు” వాత్సల్యాన్ని రుచి చూడలేదు. ఎప్పుడూ అనాధ బిడ్డ కష్టాలనే అనుభవిస్తున్నది.
1928 వ సంవత్సరం నవంబర్ 17, 18 న ఆంధ్ర మహాసభలు నంద్యాలలో జరిగాయి. అందులో భాగంగా నవంబర్ 18 న మొట్టమొదటి దత్తమండల సభ నవంబర్ 18 న జరిగింది. ఈ సమావేశాన్ని శ్రీ శరబా రెడ్డి ఆహ్వనసంఘ అధ్యక్షులుగ, శ్రీ కడప కోటిరెడ్డి అధ్యక్షుడుగా నిర్వహించడమైనది. ఈ సమావేశాన్ని నంద్యాల ప్రాంత వాసులు, సామాజిక స్పృహ కల్గిన శ్రీ ఖాదరబాద్ నరసింగరావు, శ్రీ ఆత్మకూరు సుబ్రహ్మణ్యం శ్రేష్ఠి, శ్రీ కె. కేశన్న, శ్రీ ఓరుగంట సుబ్రమణ్యం, శ్రీ వనం శంకర శర్మ, శ్రీ టి. రామభద్రయ్య, శ్రీ దాదాఖాన్ షిరాని, శ్రీ రాజా పెద్ద సుబ్బారాయుడు శ్రేష్టి ఆహ్వాన సంఘం సభ్యులుగా ఉండి ఘనంగా నిర్వహించారు.
దత్త మండలం అనే పేరు ఈ ప్రాంతాన్ని తక్కువ చేసి చూపేవిదంగా ఉన్నదని ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరును శ్రీ చిలుకూరు నారయణ రావు గారు ఈ సమావేశంలో ప్రతిపాదించారు. సమావేశంలో పాల్గొన్న వారందరు ఏకగ్రీవంగా ఆమోదించారు. శ్రీ చిలుకూరు నారాయణ రావు రాయలసీమ నామకరణం చేస్తూ ఆంధ్రులు ఈ ప్రాంత వాసులతో ఆత్మీయంగా మెలిగినప్పుడే ఆంధ్రాభ్యుదయం జరుగుతుందని చాటిచెప్పాడు.
ఈ ప్రాంతం ఆత్మగౌరవాన్ని నిలబెడుతు రాయలసీమ నామకరణం జరిగి 94ఏండ్లైన ఆంధ్ర సంపన్న వర్గాలు ఈ ప్రాంతా వాసులతో ఆత్మీయంగా మెలగకపోవడమే కాకుండా ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని కించపరిచే సంఘటనల పరంపర కొనసాగిస్తునే ఉన్నారు.
తెలుగు రాష్ట్రంలో వివక్షకు గురై, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం నేడు పాలకుల దయాదాక్షీణ్యాలకై ఎదురు చూస్తుంది.
అనాధ బిడ్డకు తల్లి, తండ్రి (పాలకులు) లేనట్లే, మేనత్త, మేనమామలు (ప్రతిపక్ష పార్టీ), చిన్నమ్మలు, చిన్న నాన్నలు (రాజకీయ పార్టీలు) కుడా ఉండనట్లే పేరు మారినా ఏ రాజకీయ పార్టీకి పట్టక పోవడంతో రాయలసీమ అనాధగానే మిగిలింది.
మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందాం అనే సందేశంతో రాయలసీమ నామకరణ దినోత్సవం ను నవంబర్ 18, 2018 న నంద్యాలలో ఘనంగా నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు వై.రాజశేఖర్ రెడ్డి,నాయకులు కాసిరావు,
జ్ఞానేశ్వర్ రెడ్డి,కోటేశ్వరరావు, మహాత్మ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ధనుంజయ రెడ్డి,ప్రిన్సిపాల్ లతాదేవి తదితరులు పాల్గొన్నారు.