(భూమన్)
ఇంత కాలంగా మేం చేస్తున్న ట్రెకింగ్ లు ఒక ఎత్తు..ఈ రోజు ట్రెక్ ఒక ఎత్తు. ఇది చాలా ప్రత్యేకం…మొదటి నుండి మా ట్రెకింగ్ లను గమనిస్తూ , ఆస్వాది స్తున్న శ్రీ మతి గల్లా అరుణ కుమారి గారు, అన్నా … మా వూరిలో మేము దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన అడవి కి మీరు ట్రెకింగ్ కి రావలసినదిగా ఆహ్వానించడం, ఆమె సంస్కారా నికి, ప్రకృతి పట్ల ఆమెకు వున్న అభిమానానికి నిదర్శనం.
మేము మొత్తం డెబ్భై మంది ట్రెకింగ్ కి వస్తున్నామని తెలియజేయగానే గల్లా రామచంద్ర నాయుడు గారు , యెంతో శ్రద్ధ తీసుకొని వారం రోజుల ముందు నుండే, వారు దత్తత తీసుకున్న పెమ్మ గుట్ట అటవీ ప్రాంతాన్ని మేము వెళ్లడానికి అనువుగా దారి యేర్పాటు చేయడం, మరియు ఇతర యేర్పాట్లు చేయించి పెట్టటమే కాకుండా, మేమందరము రావడానికి తిరుపతి నుండి బస్సును కూడా యేర్పాటు చేయడం వారి సహృదయత కు నిదర్శనం .
మా ట్రెకింగ్ సభ్యులం అందరం బస్సులో, కార్లలో ఆదివారం ఉదయం 6 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి గల్లా రామచంద్ర నాయుడు గారి స్వగ్రా మమైన పేటమిట్ట గ్రామానికి చేరుకున్న ము. ఆ గ్రామంలోనే ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా యెదిగి, నేడు వేల కుటుంబాలకు ఉపాధి కల్పించే స్థాయికి ఒక సామ్రాజ్యన్ని స్థాపించిన ఆయన ప్రస్థానం, నేటి యువతకి ఆదర్శనీయం.
పేటమిట్ట చిన్న గ్రామమే అయినా, ప్రాధమిక వైద్య కేంద్రం, మంచి పాఠశాల, చక్కని డ్రైనేజీ వ్యవస్థ, ఆధునీక రిoచిన చెరువు తో కళకళలాడు తోoది, అక్కడి వాతావరణానికి మా వాళ్లు ఆశ్చర్య పోయారు. పేట మిట్ట చేరుకోగానే గల్లా దంపతులు మాకు సాదర స్వగతం పలికి, వారి ఇంటిలో నే మాకు అల్పాహారం యేర్పాటు చేశారు. తర్వాత, గల్లా దంపతులు ఇస్టా గోష్టి గా మాట్లాడుతూ పెమ్మ గుట్ట కొండతో వారికి వున్న, ఎన్నో జ్ఞాపకాలను, అనుభూతులను పంచుకున్నారు.
ముఖ్యంగా రామచంద్ర నాయుడు గారు, వారి చిన్న తనంలో ఆవులను తోలుకొని గుట్ట మీదకు వెళ్లే వారట, కొండ చుట్టూ తిరిగే వారంట, గుట్ట మీద వుండే పెద్ద బండను ఎక్కి ఆడుకొనే వారంట, ఆ కొండతో వారి కున్న అనుబందాన్ని శాశ్వతం చేసుకోవాలని, ఆ కొండ మీద ప్రేమతో 2006 వ సంవత్సరము ఆ కొండను దత్తత తీసుకొని ఎంతో శ్రద్ధ తో , కొన్ని వేల మొక్కలు నాటించి ఆ అడవి పచ్చ దనాన్ని యెన్నో రేట్లు పెంచారు. ఇలా వారి అనుభూతులన్ని చెప్పి మమ్మల్ని ఉత్సాహ పరిచారు…
రామచంద్ర నాయుడు గారు పెమ్మ మిట్టను దత్తత తీసుకున్నాక, దానిని ఒక సామాజిక అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసి, అద్భుతంగా తీర్చిదిద్దినారు. అడవి మొదట్లో ఉసిరి చెట్లు స్వగతం పలుకుతాయి, రకరకాల చెట్లతో అడవి దట్టంగా వుంది, గుట్ట దారి మొత్తం బండ రాళ్లతో, గుండు రాళ్లతో పూర్తిగా ఎక్కుడు గానే వుంది. ముఖ్యంగా చెప్పుకోవలసినది ఈ గుట్టకి ఇదే మొదటి ట్రెకింగ్. గ్రామస్తులు వాళ్ళ అవసరాల కోసం వెళ్లడమే కానీ, ఇలా ఒక సమూహముగా ట్రెకింగ్ వెళ్లడం గుట్ట కు కూడా కొత్త అనుభూతే
అలవాటైన మేము నలభై నిమిషాల్లో ఎక్కగాలిగాము, కొత్త వారికి గంటన్నర పైగా పట్టింది…ఆపసోపాలు పడుతూ ఎక్కినా చివరికి చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం అనే సరికి అందరం సంతోష పడిపోయాము .గుట్ట పై నుండి చూస్తే నాలుగు వైపులా పచ్చదనమే, మధ్య మధ్యలో చెరువులు, చిన్న చిన్న కొండలు చాలా ఆహ్లాదముగా వుంది వాతావరణం, మనకు దగ్గరలో ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఆస్వాదిస్తునందుకు చాలా ఆనందించాము. గుట్ట మీద నీటి చెలమ, బోద పొదలు, ఎక్కుడు రాళ్లు అన్నీ కలియక తిరిగి వచ్చి ప్రతి ఒక్కరూ చాలా ఆనంద పడ్డారు..
అడవులు, జలపాతాలు, ప్రకృతి బాట పట్టడం వలన, మనకు తెలియని ప్రపంచం…మనకు తెలియని రహస్యములు చెబుతుందని , కులం, మతం, ప్రాంతం, ఆర్థిక వ్యత్యాసాలు లేని సమాజాన్ని నిర్మించుకోవడానికి ఈ నడక దారులు ఉపకరిస్తాయని చెబితే, వచ్చిన ప్రతి ఒక్కరూ అవునని అంటూ వుంటే చాలా సంతోషమనిపించింది. వచ్చిన వారందరికి ట్రెకింగ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్పి, గుట్ట అంతా కలియక తిరుగుతూ దాదాపు రెండు గంటలకు పైగా అక్కడే గడిపి తిరుగు ప్రయాణం అయ్యాము.
ఊరు చేరుకోగానే గల్లా దంపతులు ఏర్పాటు చేసిన అద్భుతమైన , గొప్ప రుచికరమైన విందు భోజనాలు మా అలసటను నిమిషాల్లో తీర్చేసింది. అక్కడే వున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీరుతున్నదిను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించి, తరగతి గదులను చూపించి చాలా విజ్ఞానాన్ని పంచి పెట్టారు
తర్వాత అక్కడి కి దగ్గరలోనే ఉన్న పాటూరి రాజ గోపాల్ నాయుడు గారి ఊరు ‘దిగువ మాఘం’ ప్రయాణం అయినాము. నేను వామ పక్ష రాజకీయాల్లో మునిగితేలుతున్న రోజుల నుండి రాజ గోపాల్ నాయుడు గారు నాకు తెలుసు, గొప్ప రచయిత, సంస్కరణ అభిలాషి, నిగర్వి, అంతకు మించి గొప్ప సంస్కారుడు. నా ఉపన్యాసాలు వినడానికి అదే పనిగా తిరుపతి కొనేటికట్టకు వచ్చేవారు. అప్పటికి, మా వయస్సు, జ్ఞానంలో ఎంత తేడా? అయినా మేము ఏదో సామాజిక మార్పును ఆశిస్తున్నామని మంచి స్ప్రుహ తో వున్న సం స్కారి వారు. ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం నాకు . నా “రాయలసీమ ముఖ చిత్రం ” పుస్తకాన్ని వారి మరణానికి ముందు ఆవిష్కరించిన మహనీయుడు. వారి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించి, కాలి నడకన వారు తిరిగిన రోజులను గుర్తు చేసుకుంటూ…ఈ పాదచారులం గొప్ప అనుభూతులను మనసులో పదిల పరుచుకొని తిరుపతి కి తిరుగు ప్రయాణం అయ్యాం.
వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ వినోద, విజ్ఞానదాయకమైన ట్రెకింగ్ గా మరపురానిదిగా మిగిలి పోతుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు…
ఈ సారి సాధారణం గా ట్రెకింగ్ కి వచ్చేవారే కాకుండా, సాకం నాగరాజు, నామిని సుబ్రమణ్యం నాయుడు, మధురాంతకం నరేంద్ర రావడం విశేషం. జర్నలిస్ట్లు , రచయితలు, కవులు, కళాకారులు, పారిశ్రామిక వేత్తలతో ఈ ట్రెకింగ్ అద్భుతంగా జరిగింది.
(భూమన్ రచయిత, వక్త, విమర్శకుడు, అన్నింటికి మించి ప్రకృతి ప్రేమికుడు)
Wonderful trecking sir.congradulations to all trecking participants.Heartfull support of Galla family for your trecking team is highly greatful..s
అన్న నమస్తే,
మరి తరానికి మన జ్ఞానం పంచడానికి ప్రకృతి పాదయాత్రలు ఒక మంచి అవకాశం లాగ అనిపించింది మీరు మలితరం వారిని ఈ ప్రకృతి యాత్రలో భాగం చేసి మీ వద్ద ఉన్న జ్ఞాన సంపదను వారికి అందించి రాయలసీమ బాగోగులను మరింత దగ్గరగా చూడండి
మీ ప్రకృతి యాత్ర చాలా అభినందనీయం .మన సీమ లో ఉన్న ప్రతి ఊరిలో ఓ గొప్ప ప్రాంతాన్ని వెలికి తీద్దాం .అభివృద్ధి చేద్దాం .రామచంద్ర నాయుడు గారి ఊరి మీద ఉన్న ప్రేమ అందరికీ ఉంటే మన సీమ ఎప్పుడో అభివృద్ధి చెందేది ఇప్పటికైనా మేల్కొందాం
సూర్య చంద్రా రెడ్డి
మన సీమ ఫౌండేషన్
Sir,
It’s greatest thing you are making everyweek. You enjoyment in trekking is highly inspirational.
Prof. Chitta Suresh Kumar, Anantapur
Dear Bhuman Sir,
మీతో ప్రయాణిస్తున్న ప్రతిసారీ ఏదో ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. చాలా సార్లు కొండల్లో సంచరిస్తూ ప్రకృతి అందాలను మీతో పంచుకోవడం, మీనుంచి కొత్తగా కొన్ని నేర్చుకోవడం పరిపాటిగా మారింది. ఈసారి ప్రకృతి తో పాటు ఓ గొప్ప వ్యక్తిత్వం కలిగిన గల్లా రామచంద్ర నాయుడు గారు మరియు అరుణమ్మ లాంటి సుధూర భావాలు కలిగివున్న వక్తులతో పరిచయం కలగడం ఎన్నటికీ మరచి పోలేనటువంటి అనుభూతిగా మిగిలపోతుంది.
ధన్యవాదాలు 🙏🙏