శ్రీశైల దేవస్థానం:
చంద్రగ్రహణం కారణంగా నేడు (మంగళవారం) ఉదయం 6.30 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయద్వారాలు మూసివేశారు. ఈ సందర్భంగా ఏమి జరిగిందంటే…
• ఈ రోజు ( 08.11.2022 వేకువజామున 3.00గంటలకు ఆలయద్వారాలు తెరచి ముందుగా మంగళ వాయిద్యాలు, 3.30గంటలకు నుండి సుప్రభాతసేవ, 4.30గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లమహామంగళహారతులు జరిపించబడ్డాయి
• మహామంగళహారతి సమయం నుండే భక్తులను సర్వదర్శనానికి అనుమతించడం జరిగింది.
• తదుపరి ఉదయం 6.30గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయబడ్డాయి.
• తిరిగి సాయంత్రం 6.30గంటలకు ఆలయద్వారాలు తెరచిన తరువాత ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించబడుతాయి.
• రాత్రి 8.00గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించడం జరుగుతుంది.
• అయితే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుంది.
• గ్రహణం కారణంగా అన్ని ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలుపుదల చేయబడ్డాయి.
• గ్రహణం కారణంగా ఈ రోజు ( 08.11.2022) మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేయడం జరుగుతుంది. రాత్రి 8గంటల నుంచి అల్పాహారం అందజేయబడుతుంది.