KTR గారికి బహిరంగ లేఖ…
*విషయం:- మీరు నేతన్నల సమస్యలపై మోడీకి “తెలుగు” లో లేఖ రాసారు..దాంట్లో ప్రధానంగా చేనేతపై GST రద్దు చేయాలనే డిమాండ్ చేసారు…
GST కి సంబంధించిన అనేక సమావేశాలలో మీరు(ప్రతినిధులు) పాల్గొన్నారు…కేంద్రం చేనేత ట్రేడింగ్ పైన 5% GST విధిస్తే మీరు ఒప్పుకున్నారు…
అయితే చేనేతపై 40 లక్షల వరకూ GST లేదు…కానీ రాష్ట్ర ప్రభుత్వాలు 20 లక్షలనుండి 40 లక్షల లోపు GST విధించుకోవచ్చు అని వెసులుబాటు కల్పిస్తే, మీ TRS ప్రభుత్వం 40 లక్షలకు కాకుండా 20 లక్షలకే ఎందుకు GST వేస్తున్నారు?
40 లక్షలు దాటాక వెయ్యవచ్చుకదా…ఇది నేతన్నలకు మీరు వేసే భారంకాదా?
మీరు దాన్ని తక్షణమే 20 నుండి 40 లక్షలకు వరకూ GST లేకుండా పెంచండి..
40 లక్షల వరకూ పెంచితే, మగ్గం నేసే వారిపై GST పడే అవకాశమే ఉండదు…
GST కూడా చేనేత ట్రేడింగ్ పై మాత్రమే పడుతుంది.
*కేంద్రం-నేతన్నల కొరకు…*
1).ప్రధాని ముద్రా లోన్స్ పధకాన్ని చాలామంది ఉపయోగించుకున్నారు…
2) కేంద్రం నుండి చేనేత కార్మికులకు ప్రతీ నెలా ఐదు కిలోల ఉచిత బియ్యం వస్తున్నాయి…
3) గతంలో నూలుపై 10% సబ్సిడీ ఉండేది,ఇప్పుడు మోడీ ప్రభుత్వం 15% సబ్సిడీ ఇస్తోంది…
*నేతన్నలపై TRS ప్రభుత్వ వైఫల్యాలు…*
1) నేతన్నలు కేంద్ర ప్రభుత్వ పధకాలు ఉపయోగించుకుందామని దరఖాస్తు చేసుకుంటే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించటంలేదు…
*Example:-* క్లస్టర్స్ అంటే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది,కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దరఖాస్తులను కేంద్రానికి పంపించటంలేదు ఎందుకు?
2).చేనేత సహకార సంఘం ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి..కానీ గత తొమ్మిదేళ్లుగా TRS ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించటంలేదు..
నిర్వహిస్తే సంఘం నాయకులు ఎదుగుతారని, కార్మికులు వాళ్లచేతుల్లో ఉంటారని, వాళ్లు రాజకీయంగా,ఆర్థికంగా ఎదగనీయకుండా ఉంచడానికే ఎన్నికలు నిర్వహించకుండా సంఘాలను నిర్వీర్యం చేశారు…
ఆ సంఘాల నాయకులే తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు అయ్యారు.. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేశారు..ఎందుకు?
3)
సంఘాలు లేక మగ్గాలు బంద్ అవుతున్నయ్.. అనేకమంది జీవనోపాధి లేక వలసపోతున్నారు.. అప్పులపాలైన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఎందుకు..?
4).TESCO కు ఛైర్మన్ ను, డైరెక్టర్ లను నియమించటంలేదు..ఎందుకు..?
5).గతంలో APCO ఉన్నప్పుడు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు బోనస్ ఇచ్చినప్పుడు, APCO లో కొంత డబ్బుతో బట్టలు కొనాలని, కండిషన్ పెట్టేవారు. ఉద్యోగులు కొనేవారు.. వ్యాపారం లాభసాటిగా ఉండేది…ఇప్పుడు మీరు ఎందుకు చెయ్యట్లేదు??
6).ప్రస్తుతం చేనేత కార్మికులకు లోన్లు కావాలంటే DCCB దగ్గర తీసుకుంటున్నారు…అక్కడ వడ్డీ రేటు 18%…అంత వడ్డీకి తీసుకుంటే లాభాలన్నీ వడ్డీలకే పోతాయి…కట్టలేక మూసేసినవి ఎన్నో ఉన్నాయి…సంఘాలు ఉంటే ఈ బాధలు ఉండేవికాదుకద! దీనికి మీ సమాధానం ఏమిటి?
7).దేశంలోనే మొదటి చేనేత హ్యాండ్లూమ్ పార్క్ పోచంపల్లిలో ఏర్పాటు చేశారు..కానీ మీ హయాంలో అది మూతపడింది.. ఎందుకు?
8).పోచంపల్లిలోని చేనేత బజార్ స్థలం కబ్జాకు గురైంది.. దీనిపై నేతన్నలు ఎప్పటినుండో పోరాడుతున్నారు..దాన్ని పరిష్కరించి, సహకరిస్తానని మీరు (KTR) హామీ ఇచ్చారు. కానీ చెయ్యలేదు.. ఎందుకు?
9).నేతన్నల కష్టాలకు కారణం మీ ప్రభుత్వమైతే,
మోడీని ,కేంద్రాన్ని దూషిస్తున్నారు ఎందుకు?
*ఉప ఎన్నికల కోసమని, నేతన్నల జీవితాలతో రాజకీయాలు చేయకుండా, వారి బతుకులలో వెలుగులు నింపాలని మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తున్నాను…
ధన్యవాదాలు
తుల అనిల్ రావు
బీజేపీ కరీంనగర్ జిల్లా ఏకనామికల్ సెల్ కన్వీనర్