దీపావళి కానుకగా బకాయిపడ్డ కనీసం కొత్త రెండు డిఎ లైనా ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న పది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు…
***
బొప్పరాజు & వైవీ రావు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు పాత డిఎ ల arrears రూపంలో 2018 జులై నుండి బకాయిపడ్డ కోట్లాది రూపాయలు నేటికీ చెల్లించలేదు.
అటు కేంద్ర ప్రభుత్వం ఇటు అనేక రాష్ట్రాలు DA లతో పాటు దీపావళి కానుకగా అదనంగా బోనస్ లు కూడా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించి ఉన్నాయి.
మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు,తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు కూడా దసరా, దీపావళి పండుగలకు కొత్త DA లు ఇవ్వటంతో పాటు పెండింగ్ DA arrears డబ్బులు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించారు.
AP JAC అమరావతి పక్షాన ఇప్పటికే తేదీ 12/10/2022 న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారినీ స్వయంగా కలిసి, మా సంఘం లేఖ ద్వారా 2018 జూలై నుండి రావాల్సిన పాత DA arraers తో సహా ఈ సంవత్సరం బకాయిపడ్డ 2022- జనవరి మరియు జూలై రెండు DA లు అలాగే అన్ని రకాల బకాయిలు తక్షణమే చెల్లించాలని కొరియున్నాము.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వారు దాచుకున్న, వారికి రావాల్సిన డబ్బులు కూడా సంవత్సరాల తరబడి ప్రభుత్వం చెల్లించకపోవడం వలన తీవ్ర నిరాశ నిస్పృహలకు గురై, అసలు DA లు ఇస్తారా, ఇవ్వరా అని ఆందోళన చెందుతూ, ఉద్యోగ సంఘాల నాయకులమైన మమ్ములను తీవ్రంగా దూషిస్తున్నారు.
కనుక, కనీసం ఈ దీపావళి పండుగ కానుకగానైనా, పెండింగులో ఉన్న 2022- జనవరి, జూలై DA లు ప్రకటిస్తారని , పది లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందిస్తారని ముఖ్యమంత్రిని AP JAC అమరావతి పక్షాన మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
(బొప్పరాజు & వైవీ రావు, AP JAC అమరావతి)