“అమరావతి రాజధాని పరిరక్షణ – ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి” నినాదంతో “అమరావతి – అరసవల్లి మహాపాదపాత్ర -II” ఉత్తేజభరిత వాతావరణంలో ప్రారంభమయ్యింది. వెంకటాయపాలెం నుండి కృష్ణాయపాలెం వరకు మహాపాదయాత్రలో నేను పాల్గొన్నాను.
ఉద్యమకారుల్లో ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంది. అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న విచ్ఛిన్నకర ఆలోచనకు స్వస్తి చెప్పకుండా వినాశనకర విధానాన్నే కొనసాగించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజల మద్దతును కూడగట్టి, ఓడించి తీరుతామన్న ప్రతిజ్ఞతో ఉద్యమకారులు నడక ప్రారంభించారు.
-టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు