ఇది కొండ అడ్డసారంలో భూమి బాగోతం.
భూమిపై నిలిచి – కేసులలో గెలిచి భూ మాఫియాకు చుక్కలు చూపించిన కొండ అడ్డసారం ఆదివాసీ దళిత బహుజన సాగుదారుల కథ ఇది.
పేదల సాగులో వున్న భూములను కాజేయడానికి భు మాఫియా రెవిన్యు అధికారుల సహకారంతో ఎలా ప్రయత్నాలు చేస్తుందో తెలుసుకోవాలంటే కొండ అడ్డసారం భూమి బాగోతం కధ చూస్తే చాలు. అడ్డసారం గ్రామం, రోలుగుంట మండలం, అనకాపల్లి జిల్లాలో వుంది. ఈ గ్రామంలో ఆదివాసీలు, ఇతర పేదల సాగులో తర తరాలుగా వున్న భూమికి, రికార్డు దాఖల యజమానులు వారసులు లేకుండా మరణించారని తెలుసుకుంది భు మాపియా. దాంతో వారు ఫోర్జరీ వీలునామా, ఫోర్జరీ వారసత్వ ధ్రువ పత్రాలు సృష్టించి వాటి ఆధారంగా రోలుగుంట తాశీల్దార్, నర్సిపట్టణం RDOల సహకారంతో 3 కోట్ల విలువైన 33 ఎకరాలకు రికార్డు మార్చేసారు.
అడ్డసారం సాగు రైతులoదరూ ఒక సంఘంగా నిలబడ్డారు. భూమిపై సాగును వదలకుండా, ఇప్పటివరకు ఒక రెవిన్యు కోర్టు, రెండు న్యాయస్తానాలలో న్యాయపోరాటంలోనూ విజయం సాధించారు. సంఘ బలం, పట్టుదల, రాజీలేని పోరాటం ద్వారా కోర్టులలో సహితం విజయం సాధించగలమని అడ్డసారం పేద సాగు రైతులు నిరూపించారు వారికీ జెజేలు. వీడియో చూడండి.
-P.S. అజయ్ కుమార్
5వ షెడ్యుల్ సాదన సమితి
అఖల భారత ఆదివాసీ సంఘం