“ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? ఏపీ ముస్సోలినిగా మారిని జగన్ రెడ్డి”
– యనమల రామకృష్ణుడు
నియంతలా ప్రజలను గుప్పిట్లో పెట్టుకుందామన్న రాజ్యాంగేతర శక్తులు చరిత్రలో కనుమరుగయ్యారు. కుప్పంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడి పర్యటనపై వైసీపీ గూండాల దాడి పిరికిపంద చర్య. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అల్లర్లను ప్రోత్సహించేది పిరికిపందలే. తరచూ ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకోవటం, దాడులకు పాల్పడటం ఏపీలో తప్ప దేశంలో మరెక్కడైనా ఉందా? నాడు జగన్ రెడ్డి తాత రాజారెడ్డి ప్యాక్షన్ ని పెంచి పోషిస్తే నేడు జగన్ రెడ్డి మళ్లీ రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి రెక్కలు తొడిగారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రశ్నించినవారిపై దాడులు చేయిస్తూ , ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ నియంతృత్వంలో ముస్సోలినిని మరిపిస్తున్నారు.
ముస్సోలినికి ఉన్న హ్రస్వ దృష్టి, అహంకార, అర్థం చేసుకోలేని లక్షణం జగన్ రెడ్డిలో అచ్చొచ్చినట్టు కన్పిస్తున్నాయి. చరిత్రలో నియంతలు, రౌడీల పరిస్థితి ఏమైందో జగన్ రెడ్డి గమనించాలి. ఓటు అనే ఆయుధంతో జగన్ రెడ్డి అరాచక, ఫ్యాక్షన్ పాలనను అంతమెందిందిచేందుకు ప్రజలు ఆకలితో ఉన్న సింహాల్లా ఎదురు చూస్తున్నారు. ఇటలీలో ఫాసిజం సృష్టికర్త ముస్సోలికి పట్టిన గతే ఏపీలో జగన్ రెడ్డికీ పడుతుంది.
పోలీసుల ఏకపక్ష వైఖరి సరికాదు, అధికారం ఏ రాజకీయ పార్టీకి అధికారం శాశ్యతం కాదు. పోలీసులు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా వ్యవహరించాలి. వైసీపీకి కొమ్ముకాస్తున్న పోలీసులకు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. శాంతి భద్రతుల కాపాడాల్సి పోలీసులు రౌడీలు, గూండాలైన వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన తప్పులకు శిక్షలు పడకుండా చట్టం నుంచి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పులు చేసిన వైసీపీ నేతల్ని, వారి తప్పుడు పనులకు సహకరించిన పోలీసులను కలిపి శిక్షిస్తాం.
జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యవసర ధరలు, రైతు సమస్యలు, దళితులపై దాడులు, ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు ఇటువంటి ప్రభుత్వ వైపల్యాలను పక్కదారి పట్టించేందుకు జగన్ రెడ్డి రాష్ట్రంలో దాడులకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు బయటపడ్డ ప్రతిసారీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడో చోట అల్లర్లు, దాడులకు పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో బ్రతకటం కంటే ఉక్రెయిన్ లో బతకటం మేలన్న భావనలో ప్రజలున్నారు. అరాచక వాదికి, అసమర్ద పాలనకు ప్రజల చేతిలో మూల్యం తప్పదు. 151 సీట్లు గెలిచామన్న గర్వంతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్న జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా దక్కదు.
Sd/
యనమల రామకృష్డుడు
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు