(భూమన్, శాన్ రమోన్ సిటి, యుఎస్)
మేమున్న చోటికి రెండు మైళ్ళ దూరంలో సీనియర్ కమ్యూనిటీ సెంటర్ ఉంది. దీన్ని నేను అందుబాటులోకి తెచ్చుకోవడంతో బోలెడంత కాలక్షేపం, జ్ఞానం. ఇందులో 55+ వారికి ప్రవేశం. ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. దీని వరకు చెబుతా…. మనం సభ్యులుగా చేరి డబ్బు కూడా 45 డాలర్లు సంవత్సరానికి చెల్లించాలి. అక్కడ వారు మీకెందుకండీ కావాల్సినప్పుడు వచ్చి పోతుండని సలహా ఇచ్చి మరింత మేలు చేశారు.
మనం ముందుగా నిర్వాహకులకు చెబితే సాన్ రామన్ పౌరులకు మూడు అంటే మూడు డాలర్స్ కి వ్యాన్ ను మన ఇంటికి వచ్చి పికప్ చేసుకుని సెంటర్ కి తీసుకువెళ్తుంది. మధ్యాహ్నం తిరిగి ఇంటికి చేరుస్తుంది.
మనం ముందుగా చెబితే వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు లంచ్ కు హాజరు కావచ్చు. మూడు డాలర్స్ డొనేషన్ కొందరి ఇస్తున్నారు. మరికొందరు తిని పోతున్నారు. ఆ లంచ్ బయట 15 డాలర్స్ కు తక్కువ ఉండదని మా అబ్బాయి అన్నారు. లంచ్ కాగానే అక్కడ ఉండే రకరకాల breads ఇంటికి తీసుకెళ్లొచ్చు. ప్రతి నెల లంచ్( bob, non and veg) మెనూ ముందుగానే ప్రింట్ చేసి ఇస్తారు.
సెంటర్లో రకరకాల ఇండోర్ గేమ్స్ bridge, bingo, yoga, kuala, simple exercises ఉంటాయి. కొంత పేమెంట్ తో ఇక్కడ కారు డ్రైవింగ్ కూడా శిక్షణ ఇస్తారు. 20 డాలర్ల రుసుముతో.
నెలలో కనీసం 7, 8 రోజులు outing. Lunch. Brunch పేరుతో ఉంటాయి. మినిమం ఫీజ్ తో వారి వ్యాన్ లోనే తీసుకువెళ్లి తీసుకువస్తారు.
లైబ్రరీ, టీవీ, కంప్యూటర్ సదుపాయం వాటితో పాటు కాఫీ వెసులుబాటు ఉంది.
సమ్మర్ కు స్వాగతం పలుకుతూ ఉచితంగా మంచి ఐస్ క్రీమ్ పార్టీ ఏర్పాటు చేయడం అద్భుతంగా అనిపించింది.
అందులోనే ఐదు డాలర్లకు Summer Barbeque పేరిట అద్భుతమైన పార్టీ చాలా గొప్పగా అనిపించింది ఈ సెంటర్ కి అన్ని దేశాల వారు దాదాపు 70 మంది దాకా వస్తున్నారు తెలుగు వాళ్ళు ఒక నలుగురు మన దేశస్తులు మరో ఏడుగురిని కలుస్తుంటాను ఇంత అపురూపమైన అవకాశం దగ్గరలో ఉండడం అది అన్ని రకాలుగా ప్రయోజనాకరంగా ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది.
(భూమన్ రచయిత, ప్రకృతి ప్రేమికుడు.ఇపుడు అమెరికా పర్యటనలో ఉన్నారు.)
It’s a good facility for senior citizens to spend time with same age groups. Even in India we may start the same type of
Facility.