(భూమన్ )
కాలిఫోర్నియా సమీపంలో ఈ వారంలో రోజు మార్చి రోజు హైకింగ్ చేసే అవకాశం రావడం ఒక అపురూపమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రతి మారు ఈ కొండల వరుస విలాసంగా కనిపిస్తున్నది. ఆ ఎత్తు పల్లాలు బహు ముచ్చటగా… ఆహ్లాదంగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల ఎండిపోతున్న బోద గోధుమ రంగులో సంభ్రమాశ్చ ర్యాలలో ముంచుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ కాలిఫోర్నియా ఎండలకు మంటలు చెలరేగుతాయని చూసేటివి చూసేసెయ్యాలని ఆత్రుత.
కొండలు.. అడవులు వాటి మధ్యన నా నడక పరిపరి విధాల ఆలోచనలను రేకెత్తిస్తుంటుంది. ప్రకృతి నియమాలు, వాటి మార్పులు, చేర్పులు, అడవుల్లో నదీనదాలు, పిల్ల కాలువలు, జంతువులు, పక్షులు అబ్బో…. ఆ ప్రపంచమే ఒక వింత. ఈ కొండలు, అడవుల్లో నుండే కదా ఎన్నో విప్లవాగ్నులు చెలరేగింది. ఈ కొండల మధ్యన అనుమానంగా బతుకుతూ వస్తున్న ఒక మానవ రాశిని దిగమింగింది ఈ ఆధునిక సమాజమే కదా.
ప్రకృతి స్వభావం అర్థం చేసుకునే కదా మానవాళి ఇవ్వాలా ఇంతగా రాణిస్తున్నది. అటువంటి ప్రకృతి పట్ల మనకు ఎంతో శ్రద్ధ, జాగరుకత ఉండాలి. ప్రకృతి నుండి నేర్చుకోవడమే మనల్ని మనం అర్థం చేసుకోవడానికి… మన చుట్టూ ఉన్న సమాజాన్ని అంచనా వేసుకోవడానికి పనికొస్తుంది కదా!
ఒక్క ఆనందమే కాదు లోతైన నిశితమైన ఆలోచనలు ముసురుకుంటూ ఉంటాయి. నా ఈ దారుల్లో ప్రపంచాన్ని వ్యాఖ్యానించటం గురించి మార్చటం గురించి పట్టు పట్టమని చెబుతూ ఉంటాయి…. ఆ నడకదారుల సంభాషణలు
ఈ వారం Gray fox, stream line, Alamo, quill trails చూసినాను. ఒక్కో ట్రెయిల్ సుమారుగా 10 నుంచి 12 కిలోమీటర్లు దూరం ఉంటాయి టాల్స్టాయ్ చెన్నట్టుగా ” One of the first conditions of happiness is that the link between man and nature shall not be broken ”
(భూమన్ రాయలసీమకు చెందిన రచయిత, ప్రకృతి ప్రేమికుడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు)
ఇది కూడా చదవండి