పీడన (ఒక కరోనా కవిత)

పీడన

***
కరోనాకేంతెలుసు!
తనది’రోగ’పీడన
మనిషిది’వర్గ’పీడన

కరోనాకేంతెలుసు!
తనది’భౌతిక’దూరం
మనిషిది’సామాజిక’దూరం

కరోనాకేంతెలుసు!
తన జీవితం క్షణికం
మనిషిది తరంతరం

కరోనాకేంతెలుసు!
తనపీడనకు హక్కులు లేవు
వీడి పీడన హక్కుభుక్తం

కరోనాకేంతెలుసు!
తనది దగ్గు తుమ్ము జ్వరం
వీడిది కులం మతం మౌఢ్యం

కరోనాకేంతెలుసు!
తన పీడన సహజం
మనిషి పీడన అసహజం

కరోనాకేంతెలుసు!
తన పీడన ఉద్దేశ్య రహితం
వీడి పీడన ఉద్దేశ్యపూర్వకం

కరోనాకేంతెలుసు!
తన పీడనకు వర్గంలేదు
వీడిది వర్గపీడనం

కరోనాకేంతెలుసు!
తానొక కొవ్వుకణం
మనిషిని దోపిడిరణం

కరోనాకేంతెలుసు!
తనది క్షణ పీడన
వీడిది క్షణక్షణ పీడన

కరోనాకేంతెలుసు!
తాను వాక్సిన్ తో హతం
వీడి పీడనకు లేదా అంతం?

***
-తమ్మినేనిఅక్కిరాజు
హైదరాబాద్
‌ 27-6-2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *