(భూమన్)
అమెరికా వాళ్లకి ఆరోగ్య స్పృహ ఎక్కువే. హైకింగ్, బైకింగ్, స్విమింగ్, జిమ్, యోగ ఇంకా నాకు తెలియనివెన్నో పాటించడం గమనించాను.
మన శేషాచలం లంకమల నల్లమల శ్రీకాకుళం, ములుగు అడవులను చుట్టొచ్చినాక, ఇక్కడి అడవులు కొండలు, మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మనం ట్రెకింగ్ అంటే, ఇక్కడంతా హైకింగ్. మనం అడవులు కొండల్లో దారులు చేసుకుంటూపోతే, ఇక్కడేమో దారులేసిన చోటల్లా నడుస్తాం, పరిగెత్తుతాం, ఎక్కుతూ దిగుతూ ఉంటాం.
కాలిఫోర్నియా చాలా రకాలుగా మంచి రాష్ట్రమని పేరు. నేను ఉంటున్న San Ramon county చుట్టూతా కొండలే. మార్చిలో అన్నీ పచ్చపచ్చగా రకరకాల పుష్పాలతో అద్భుతాన్ని సృష్టిస్తే, ఇపుడేమో ఎక్కడ చూసినా గోదుమ రంగులోని కొండలే. వాటి మధ్య అక్కడక్కడా మంచి చిక్కటి ఓక్, పైన్ చెట్లతో అడవులు ఆహ్లాదకరంగా ఉన్నాయి.
వచ్చిన తొలిరోజుల్లో బాగా కష్టమని చెప్పే Mission Peak , Mountain Diablo హైకింగ్ చేసేశాను. ఒక్కొక్కటి దాదాపు పన్నెండు కిలో మీటర్లు. రాను పోనూ బాగా ఎక్కుడూ దిగుడూ నిజంగానే చాలెంజింగ్ హైక్స్ అనిపించింది.
ప్రతి హైక్ ఎవరికి వారుగా పోవడం రావడమే. ఒంటిరిగా పోయినా ఏ భయమూ లేదు. Coyoto, Owl, Deers, Turkey లాంటివి ఎపుడూ కానరావు.
ఆ తర్వాత ప్రతివారం రెండేసి చొప్పున హైక్స్ చేస్తున్నాను. రెండు లేదా మూడు గంటల దూరం రానుపోనూ హైక్స్ దూరం. ఇంటి నుంచి బైక్ లో వెళ్లడం, అక్కడ లాక్ చేసి ఒంటిరిగా ముందుకుపోవడమే. ఒక మిషన్ పీక్ లో మాత్రం వేలాదిగా జనం రావడం చూసినాను. కాని మిగిలినవన్నీ వందల్లోనే. ఇపుడిపుడే ఫైర్ మొదలయింది. కనుక ముందు ముందు సాధ్యం కాకపోవచ్చు.
ఇక్కడి కొండల వరస భలే ముచ్చటగా ఉంటుంది. లోయలు, సన్నటి కాలువలు, పక్షుల అరుపులు అదొక అద్భుతానుభూతి. Bishop Ranch Hiking చాలా దూరం సాగుతుంది. దాదాపు మూడు గంటల ఇరవై నిమిషాలు రానుపొను. ఇంకా పోయే కొద్ది ఉంది కాని, ఎగుడు దిగుడుకు తీవ్రమయిన ధగ ఏర్పుడుతుందని పొద్దున ఐదు గంటలకు బయలు దేరి ఎనిమిది గంటలకు తిరిగివస్తున్నాను.
ప్రతి హైక్ లోనూ ఏదో ఒక కొత్త దనాన్ని చూస్తున్నా. నా కళ్ల ముందే పచ్చదనమంతా సమసిపోయి గోదుమరంగులోకి మారడం లోయల్లో చిక్కటి అడవుల మధ్యన ఆ చల్లదనం ఒంటికి హాయి అనిపిస్తున్నది.
ఒక పక్క సత్యాన్వేషణ, అసమర్థుని జీవితయాత్ర, కన్యాశుల్కం, మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి పూర్తి చేస్తూనే పోతున్నా. ఎన్ని మార్లు చదివినా వీటిలో ఏదో కొత్త కోణం కనిపిస్తున్నట్లే, నా నడక దారుల్లోనూ కొత్త దనం ఉంది. ఎన్ని చదివినా చేయవలసిందేదే చేయాలగదా అనే మధనం. ప్రతిసారి చదవిని పుస్తకం, కొత్తకాగానే ఉంటున్నదంటేచదివే విధానంలో ఏదయినా లోపం ఉందా అని అనుమానం.
అటు మెదడుకు ఇటు శరీరానికి పని కల్పించుకుంటున్నాననే మెలకువ ప్రతి ఒక్కరిలోకలగాలనేదే నా ఆశ.
ట్రెండింగ్ తెలుగు న్యూస్ జింకా నాగరాజు నా చిరకాల మిత్రుడు. ట్రెకింగ్ హైకింగ్ అతను ఇస్తున్నప్రాధాన్యత అతని సంస్కారణాన్ని జీవితపు విలువను చెబుతున్నది. ఈ నా నడక దారులను మీరు అలవాటుగా మార్చుకుంటారనే నమ్మిక.
(భూమన్, రచయిత, ప్రకృతి ప్రేమికుడు)
Super sir
Fantastic photos
Super news Mama. Nice posting of your hiking photos.
Have a great time 😊