తెలంగాణ ‘చెట్టు కింది స్కూల్’

మూడు సంవత్సరాలుగా చెట్ల కింద 43 విద్యార్థులకు బోధన

రఘునాథ్ పల్లి మండలంలోని లక్ష్మి తండ గ్రామ పంచాయితీ పరిధి లో ఉన్న mpps పాఠశాలను ఇది.

విద్యార్థుల కు బిల్డింగ్ లేకుండా ఆరు బయటనే గత మూడు సంవత్సరాలుగా క్రింద కూర్చొని చెట్లా కిందనే తరగతలు నిర్వహిస్తున్నారు.

SFI జిల్లా కార్యదర్శి ధర్మ భిక్షం ఈ పాఠశాలను సందర్శించి విద్యార్థుల దుస్థితి బయట పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

పొద్దున లేస్తే వ్యవసాయ పనుల్లో గిరిజన తల్లిదండ్రులు వెళ్తుంటారు. సరైన బోధన చేద్దాం అని ఉపాధ్యాయులు ప్రయత్నం చేసినా సౌకర్యాలు లేక వర్షంలో చలిలో చెట్ల కింద 43 మంది విద్యార్థులు కూర్చుని అక్షరాలు నేర్చుకుంటున్నారు.

ఉన్నత అధికారులు జిల్లా అధికారులు మీ పర్యటనలో భాగంగా గిరిజన తండాల్లో ఉన్న బడులను సందర్శించండి… చదువు కుందాం అనే కోరిక ఉన్నా చదువు ఆమడ దూరంలో ఉంటున్నది. ఒక వైపు మన ఊరు మన బడి పేరుతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని అంటున్న నాయకులు విద్యార్థులు ఉన్న చోట కనీసం గుడిసె కూడా లేకుంటే చదువు ఎలా సాధ్యం అవుతుందని అని  ధర్మ భిక్షం ప్రశ్నించారు

తెలంగాణ రాష్ట్రం వస్తే విద్య రంగ సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యా అభివృద్ధి అవుతుంది ఉద్యోగాలు వస్తాయి అని తెలంగాణ బిడ్డలు బలిదానం చేసుకుంటే తెలంగాణ బిడ్డ లు ఉద్యమాలు చేస్తే నేడు అంత కన్నా దారుణ పరిస్తితి మన రాష్ట్రంలో ఉందని అన్నారు

తక్షణమే సమస్యలు పరిష్కారం చూపాలని బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు లేని యెడల ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *