(నవీన్ కుమార్ రెడ్డి)
తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ప్లాస్టిక్ నిషేధించడాన్ని స్వాగతిస్తున్నాం కానీ భక్తులకు పూర్తి అవగాహన వచ్చేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా టీటీడీ దృష్టి సారించాలి!
తిరుపతి అలిపిరి టోల్ గేట్ వద్ద బస్సులలో కార్లలో తిరుమలకు వెళుతున్న భక్తుల వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ ను తనిఖీలు చేసి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు!
తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒకచోట ప్రత్యామ్నాయంగా
“జల ప్రసాదం”త్రాగునీటి కౌంటర్లను ఏర్పాటు చేయాలి!
తిరుమలకు వెళ్లే ప్రతి బస్సు లో అత్యవసర పరిస్థితులలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా కనీసం 10 లీటర్ల వాటర్ క్యాన్ తో పాటు పేపర్ గ్లాసులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలి
తిరుమల కొండకు సుదూర ప్రాంతాల నుంచి బస్సులలో కార్లలో వచ్చే భక్తులలో అనేక మంది వయస్సులో పెద్దవారు,పసిపిల్లలు కొంతమంది ఆరోగ్యరీత్యా హార్ట్ పేషెంట్లు,బీపీ, షుగర్ ఉన్నవారు ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు అత్యవసరంగా( మెడిసిన్) టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చినప్పుడు,ఎండకు దాహం వేసినప్పుడు పసిపిల్లలకు త్రాగునీరు అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనబడుతున్నాయి!
తిరుమలకు వెళ్లే రెండు నడకదారిలలో భక్తుల సౌకర్యార్థం టిటిడి ఏర్పాటు చేసిన త్రాగునీటి సౌకర్యం తరహాలో రెండు ఘాట్ రోడ్ లలో కూడా ఏర్పాటు చేయాలి!
తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధాన్ని అంచలంచలుగా ఎస్వీబీసీ,ప్రైవేట్ ఛానల్ ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ భక్తులకు పూర్తి అవగాహన వచ్చేవరకు మరికొన్ని రోజులు గాజు నీటి బాటిల్స్ తో పాటు ప్లాస్టిక్ నీటి బాటిల్స్ ని కొంతమేరకైనా తిరుమలలో అందుబాటులో ఉండేలా టిటిడి అధికారులు ధర్మకర్తల మండలి పునరాలోచించాలి!
టీటీడీ ధర్మకర్తల మండలి సహృదయంతో అనుమతిస్తే తన సొంత నిధులతో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్ లో 5 వాటర్ కూలర్ యూనిట్ లను టిటీడీ కి అందజేస్తాను
(నవీన్ కుమార్ రెడ్డి, శ్రీవారి భక్తుడు, తిరుపతి)