సింహాచలం, మే 4 :ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బుధవారం గుమ్మడి పండు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం కల్పించే స్వామి తిరిగి అదే రోజు రాత్రికి చందన దారి అవుతారు.
చందనోత్సవం లో భాగంగా వివిధ రకాల ఫల, పుష్ప శీతలాదులతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించి అభిషేకము లో పాల్గొన్న భక్తులందరికీ తీర్థము అందజేశారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం సిబ్బందికి, అక్కడున్న వారికి అవకాశ దర్శనము కల్పించారు.
చిన్న జీయర్ స్వామి నేరుగా భక్తులకు తీర్థము అందజేశారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా స్వామికి తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించారు. దీంతో తొలి విడత చందన సమర్పణ పూర్తి
కావచ్చింది.. ఈ నేపథ్యంలోనే బుధవారం గుమ్మడిపండు అలంకరణలో భక్తులకు సింహాద్రినాధుడు దర్శనమిచ్చారు.
స్వామిని దర్శించుకున్న భక్తులు అంతా పరవశం చెందారు… తిరిగి వైశాఖ పౌర్ణమి రోజు రెండో విడతగా మూడు మణుగుల చందనాన్నిఆ సిరులొలికించే సింహాద్రి నాధుడు స్వామికి సమర్పించనున్నారు.. చందనోత్సవం విజయవంతం కావడంతో ఆలయ వర్గాలు పూర్తి సంతృప్తి చెందుతున్నయీ.. అతి పెద్ద ఉత్సవము చందనోత్సవం విజయ వంతం చేసిన అందరికి పేరు పేరు న ధన్యవాదములు తెలుపుతున్నారు. ఇదే సమయంలో ఆలయానికి దర్శనాలు ,ప్రసాదాలు, ఇతర విభాగాలు ద్వారా అప్పన్న కు భారీగా కూడా ఆదాయం సమకూరింది… బుధవారం గుమ్మడి పండు అలంకారంలో ఉన్న అప్పన్న స్వామిను ఆలయ ధర్మ కర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు దంపతులు దర్శించుకున్నారు….
..గుమ్మడి పండు దర్శనం విశేషం
పురాణ ఇతిహాస కథనాల ప్రకారం గుమ్మడి పండు దర్శనానికి విశేష ప్రాచుర్యం ఉంది.. గర్భిణీ స్త్రీలు గుమ్మడి పండు అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుంటే గుమ్మడి పండు లాంటి పిల్లలు పుడతారు అన్నది ఈ కథనం ప్రాచుర్యం. వైశాఖ పౌర్ణమి వరకు స్వామి ఇదే అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. కాబట్టి ప్రశాంతంగా స్వామిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుంది