మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరణ
***
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని 100 % బోగస్ అని, తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఆయన వచ్చే నెలలో బీజేపీ లో చేరతారని పొద్దుటి నుంచి ఊహాగానాలు విబడుతున్నాయి. ఈ నేపథ్యమ్ లో జూపల్లి వివరణ ఇచ్చారు.
ఆయన వివరణ ఇదే…
“పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఇంకొకటి కావచ్చు. పూర్తిగా అప్రజాస్వామికంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నదానికి వారిమీద చర్యలు లేవు, ఎవరు పట్టించుకోవడం లేదు. జిల్లా మంత్రులు కానీ, అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకొచ్చాము. ఐన చర్యలు లేని కారణంగా దానికి ప్రొటెస్టుగా నేను ప్లీనరీకి పోలేదు. అంతే తప్ప వేరేది ఏమీ లేదు.నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. రేపు ఏం జరుగుతుందో వారి నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. జరుగుతున్నటువంటి పరిణామాలు పోలీస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి విధంగానే, మా నియోజకవర్గంలో పోలీసులు కార్యకర్తలను బూటు కాలుతో తన్నడం, బెల్టుతో కొట్టడం, రౌడీ షీట్లు పెట్టడం, మహిళలను, ప్రజలను వేధిస్తున్నారు. వీటిపైన చర్యలు లేవు , దానికి నిరసనగా నేను ప్లీనరికి పోలేదు, ఈ విషయాలు పార్టీ నాయకత్వం దృష్టికి కూడా పోవాలి.అతి త్వరలో మళ్లీ పార్టీ అధినాయకత్వాన్ని కలుస్తాను.”