టీఆరెస్ పార్టీ 21వ ప్లీనరీ లో సీఎం కేసీఆర్ తన జాతీయ దృక్పథాన్ని ప్రకటించారు. దేశం ముందుకు, దూసుకుపోతున్నాది, వెలిగి పోతాంది అని భుజాలు ఎగరేసుకుంటున్న వాళ్ళు చైనా, సింగపూర్ వైపు చూసి నేర్చుకోవాలి చెప్పారు. ఆదేశాలు అగ్రస్థానం లో ఎందుకున్నాయి, భారత్ ఎందుకు లేదు అని ప్రశ్నించారు. అదేవిధంగా తాను జాతీయ రాజకీయాలను వదిలేయలేదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే…
* అవసరమైన సమయంలో జాతీయ రాజకీయాల పై ముందుకు వెళతాం.
* జాతీయ రాజకీయాల పై దేశ- విదేశాల నుంచి ముఖ్యమైన చర్చలు 15 రోజులు త్వరలో జరుపుతాం.
* IAS- రిటైర్డ్ ఉన్నతాధికారులతో హైదరాబాద్ లో సమావేశం పెడుతా.
* ప్రధాని కుర్చీ అనేది మన లక్ష్యం కాదు.
* ఫ్రంట్ లు – టెంట్ లు అనేది ముందుకు సాగవు.
* చైనా పాలసీ కంటే ఇండియా పాలసీ బెటర్ గా ఉంటె ఎందుకు అభివృద్ధి చెందలేదు అనేది ప్రశ్న.
* ఇండియా కంటే బాగా సింగపూర్ లో టూరిజం లేదు…అయినా ప్రపంచం అంతా సింగపూర్ వెళ్తారు
* కలలను నిజం చేసుకోవచ్చు అందుకు ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే.
* మనస్సుపెట్టి చేస్తే అమెరికా ను మించిన ఆర్థికశక్తిగా ఇండియా అవుతుంది.
* దేశానికి కొత్త ఎజెండాను తయారు చేయడానికి నేను ఒక సైనికున్ని అవుతా
* జాతీయ పార్టీ కోసం ఫండ్ కావాలంటే టీఆరెస్ కు ఉన్న 60లక్షల సభ్యత్వమే మా బలం.
* 60లక్షల సభ్యత్వం ఉన్న మాకు తలా ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చినా 600 కోట్లు అవుతుంది.
* నియోజకవర్గాల్లో కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
* ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా విధిగా ప్రజల కోసం పనిచేస్తాం.
* ఎవరు అవాకులు చెవాకులు మాట్లాడినా పట్టించుకోవద్దు మనమే మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నాం.
* సర్వేల్లో 90స్థానాలకు పైగా టీఆరెస్ గెలుస్తుందని ఫలితాలు వచ్చాయి.
* త్వరలో కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఉంటాయి.
* మన రాష్ట్రం నుంచి పార్టీ ప్రతినిధులు విదేశాల టూర్ ఉంటుంది.
* జాతీయ పార్టీ అంటే దాతలు విరాళాలు ఇచ్చారు.
*టీఆరెస్ పార్టీకి 861కోట్లు నిధులు ఉన్నాయి
*sbi-బ్యాంక్ ఆఫ్ బరోడా లో నిధులు ఉన్నాయి
*3కోట్లా 81లక్షల వడ్డీ మనకు నెలకు వస్తోంది
*అన్ని కలిపి 865కోట్లు నిధులు మనకు ఉన్నాయి
*జిల్లా పార్టీ కార్యాలయాలు కలిపితే సుమారు 1వెయ్యి కోట్లకు పైగా నిధులు ఉంటాయి*
*పార్టీకి రెండు ఇన్నోవా కార్లు- ఒక ఫోర్ట్ వాహనం ఉంది
* మనం ముందుకు వెళదాం తప్పకుండా విజయం సాధిస్తాం.
* ఫ్రంట్ లు టెంట్ లు కాకుండా ప్రత్యామ్నాయ ఎజెండా వస్తే దేశం బాగుపడుతుంది.
* పార్టీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుందాం.
*ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ పై…
*కరోనా పై వీడియో కాన్ఫరెన్స్ లేదు ఒత్తిగనే డ్రామా
*ప్రజల పై ప్రధానికి ప్రేమ ఉంటే సెస్ లు ఎందుకు పెంచుతున్నారు?
* ప్రధాని మాట్లాడాల్సిన మాటలు మోడీ మాట్లాడటం లేదు.
*మేము ఒక్క రూపాయి కూడా టాక్స్ పెంచలేదు- మేము ఎందుకు టాక్స్ తగ్గించాలి?- కేసీఆర్
* బీజేపీ పార్టీ నాయకులకు సిగ్గు ఉండదు.
*ప్రభుత్వ సంస్థలను అమ్మితే 1వెయ్యి కోట్ల బహుమతి పెట్టినది కేంద్రం
* బీజేపీ దుర్మార్గుల నీతిని ఎండగట్టాలి.