TSPSC యాస్పిరాంట్స్ కీ ఫ్రీగా స్టడీ మెటీరియల్

సిద్దిపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజన కార్యక్రమం, స్టడీ మెటీరియల్ అందించే కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు  ప్రారంభించారు.

ఈ సందర్బంగా  హరీశ్ కామెంట్స్ :

-భవిష్యత్తులో ప్రతియేటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం.

– గ్రూప్-1, 2 ఇంటర్వ్యూలు లేకుండా రాత పరీక్షతో పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు ఉంటాయి.

– త్వరలోనే 500 పైగా గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేస్తాం

– గ్రూప్ -1లో కూడా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు. ఈ ఘనత సీఎం కేసీఆర్ దే.

– 317జీఓతో అన్నీ జిల్లాల ఉద్యోగులకు సమ న్యాయం చేస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు మాట్లాడటం తగదు.

– కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 15 లక్షల 65 వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తుందో రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ తెలపాలని డిమాండ్.

– కేవలం ఒక్క రైల్వేశాఖలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీజేపి నాయకులను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు.

– కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇస్తామంటే మీకే పాలాభిషేకం చేస్తాం.

– తెలంగాణ దేశంలోనే అన్నీ రంగాల్లో అగ్రామిగా ఉన్నదని, బీజేపి నాయకులు నోరు పారేసుకోవడం తప్ప అస్సలు విషయం మాట్లాడారని వెల్లడి.

– బీజేపి డబుల్ ఇంజన్ గ్రోత్ ఎక్కడకి పోయిందని, ఎక్కడ కూడా అభివృద్ధి లేదని, తెలంగాణ యువత ఆలోచించాలని కోరారు.

– తెలంగాణ రాష్ట్ర బీజేపి నాయకులు దమ్ముంటే తెలంగాణలోని 23 జిల్లాలకు రావాల్సిన నవదయ స్కూల్స్ తేవాలని డిమాండ్.

– సిద్ధిపేట గ్రంథాలయంలో జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మెసేజ్- సందేశం ద్వారా తెలుస్తుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *