మీరు ఇంటర్నెట్ సర్ఫ్ చేస్తున్నపుడు మిళమిళ మెరుస్తూ నోరూరించే మామిడిపళ్ల ఫోటోలతో ఈ వెబ్ సైట్ ప్రత్యక్ష మవుతుంది. prachiworld.in అనే పేరుతో ఈ వెబ్ సైట్ ఉన్నట్లుండి పాప్ అవుతుంది. అయితే, ఇది కేవలం మీరు బుక్ చేసేందుకు మాత్రమే. చాలా చవకగా మామిడి పళ్లు, డ్రైఫూట్స్, వస్త్రాలు సప్లై చేసే ఇ-కామర్స్ సైట్ గా ఇది పబ్లిషిటి చేసుకుంటూ ఉంది. ఇది మామిడి పళ్ల సీజన్ కాబట్టి, ఎక్కడాదొరకనంత చవగ్గా మామిడి సప్లై చేస్తానని మాయచేస్తుంది. ఆ ఫోటోలు చూస్తే ఎవరయినా పళ్లు కొనాలనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే యాడ్ క్యాంపెయిన్ విపరీతంగా చేస్తూ ఉటుంది.
మార్కెట్లో రు.150 ల కిలో ఉండే మామిడి పళ్లను కిలో రు.50 లోపే సప్లై చేస్తానంటారు. మినిమం పదికిలోలు బుక్ చేసుకోవాలి. తర్వాత ఒక రోజులో సప్లయి చేసేందుకు ఒక షిప్పింగ్ చార్జ్, తర్వాత రెండు రోజులొకొక షిప్పింగ్ చార్జ్ … ఇలా రకరకాల డెలివరీ చార్జ్ వసూలు చేస్తారు. జిఎస్ టి కూడా వసూలు చేస్తారు. మీరు బుక్ చేసుకున్నాక, బుకింగ్ కన్ఫర్మ్ చేస్తూ ఇమెయిల్ వస్తుంది. అంతే… ఇక ఈ వెబ్ సైట్ మాయమవుతుంది. మీకు ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. షిప్పింగ్ ట్రాక్ చేసేందుకు వెబ్ సైట్ లేదు. అంటే prachiworld.in లో మామిడి పళ్లతో పాటు ఇతర ఉత్పత్తులు బుక్ చేశారంటే మీ డబ్బు గల్లంతే. మాకు అనేక ఫిర్యాదులు అందడంతో క్రాస్ చెక్ చేసుకునేందుకు మేం పది కిలోల మామిడి పళ్లు బుక్ చేశాము. మేమూ మోసపోయాం. మా అర్డర్ [Order #25556] (April 6, 2022). పది కిలోల మామిడి పళ్ల ధర రు. 399. రెండు రోజుల్లో డెలివరీ చేసేందుకు షిప్పింగ్ చార్జ్ రు. 49. టాక్స్ రు. 80.64. మొత్తం 528 .64. బుకింగ్ కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది.
బుకింగ్ కన్ఫర్మేషన్ ప్రకారం రెండు రోజుల్లో మామిడి పళ్లు అందాలి. ఇప్పటికి రెండు వారాలయింది. మామిడి పళ్లు రాలేదు. ఈ విషయం మెయిల్ చెస్తే రిప్లైలేదు. కస్టమర్ కేర్ నంబర్ ఏదో తెలియదు. ఉన్న నంబర్లు పనిచేయవు.
దీనితో ఇది ఫేక్ వెబ్ సైట్ అని, కేవలం బుకింగ్ చేసుకునేందుకు మాత్రమే సైట్ ఉందని అర్థమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ యూట్యూబ్ చానెల్ ఉంది. కాని దాని క్వాలిటీ చూస్తే అది బోగస్ అని అట్టే అర్థమవుతుంది. ఈ సైట్ బోగస్ అవునో కాదో చూద్దామని గూగుల్ సెర్చ్ చేస్తే బాధితులు వందల్లో ఉన్నారని అర్థమయింది. అంతా , డబ్బు వాపసు ఇవ్వండి అని వాపోతున్నారు. అయినా, ఈ సరే ఈ వెబ్ సైట్ దర్జా గా డిజిటల్ యాడ్స్ క్యాంపెయిన్ చేస్తూ వందలాది మందిని మోసగిస్తూనే ఉంది. కొద్ది రోజులు ఇలా దోచుకుని దుకాణం మూసేసి వెళ్లిపోవచ్చు.
ఇది ఇంకా అధికారుల దృష్టికి పోకపోవడమే ఆశ్చర్యం. కస్టమర్లు చేసే ఫిర్యాదులకు స్పందించి అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఇలాంటి ఫేక్ వెబ్ సైట్లను బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి ఆన్ లైన్ క్యాంపెయిన్ తో అమాయకులను మోసం చేస్తున్నారు. మామిడిపళ్లు కొన్నందుకు నాలుగయిదు వందలతో బుక్ చేయవచ్చు. చాలా మంది పోయింది నాలుగయిదు వందలే కదా అని ఎవరికీ ఫిర్యాదు చేయకుండా మానుకోవచ్చు.అయితే, ఇలా ఎన్ని వందలమంది నాలుగయిదు వందలు మామిడి పళ్ల కోసం మోసపోతున్నారో.
Radha Puri
Media is complicit in misleading ad and ad frauds For last 3 Days I have been seeing advertisements for prachiworld on various media news s Read more at: https://www.localcircles.com/a/public/post/media-is-complicit-in-misleading-ad-and-ad-frauds/8355537cy (source: https://www.localcircles.com/a/public/post/media-is-complicit-in-misleading-ad-and-ad-frauds/8355537cy)