2014లో దేశ రాజకీయాలలో సునామీలా విరుచుకుపడి, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్నిసంపూర్ణ మెజారిటీతో ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలన ఎలా ఉంది?
ఒక హార్వర్డ్ అయ్యవారు (ప్రొఫెసర్) ఆయన కు ఫెయిల్ మార్కులు వేశారు. ఆయనెవరో అమెరికా ప్రొఫెసరో, చైనా ప్రొఫెసరో కాదు. చక్కటి భారతీయుడు. హిందూత్వ వాది. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయన పేరు డాక్టర్ సుబ్రమణియన్ స్వామి. ఆయన గొప్ప ఆర్థిక వేత్త. అమెరికా హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధించిన ప్రొఫెసర్. దేశ ఆర్థిక విధానాలమీద వ్యాఖ్యానించే అర్హతలున్నవాడు. ఆయన మాజీ కేంద్ర మంత్రి. సంచలనాలు సృష్టించే లిటిగెంట్. ఆయన లీగల్ వార్ ఎవరిమీద నయినా ప్రకటిస్తే, అవతలివ్యక్తి జైలుకు పోవడమో లేదా చితికి పోవడమో తప్పనిసరి. దేశంలోని పలుకుంభకోణాలు వెలికి తీసిన వ్యక్తి. ఆయన బిజెపిలోనే ఉన్నా తొలి నుంచి ప్రధాని మోదీఅనుసరిస్తున్న ఆర్థిక విధానాలనును క్రిటికల్ పరిశీలిస్తూ వస్తున్నారు. హెచ్చరిస్తూ వస్తున్నారు.
చివరకు ఈ రోజు ఆయన ప్రధాని మోదీకి ఫెయిల్ మార్కులు వేశారు.
In 8 years in office we see that Modi has failed to achieve targets of economic growth. On the contrary, growth rate has declined annually since 2016. National security has weakened hugely. Modi inexplicably is clueless about China. There is scope to recover but does he know how?
— Subramanian Swamy (@Swamy39) April 19, 2022
ఇది మొదటి సారి కాదు. నిజానికి నెలానెలా వస్తున్న ప్రొగ్రెస్ రిపోర్టు. కాంగ్రెస్ వాళ్లు ఇలాఅంటే ప్రతిపక్షం కాబట్టి ఇలా విమర్శిస్తున్నారని, అబద్దాలుప్రచారం చేబుతున్నారని అనుకోవచ్చు. మమతా బెనర్జీ ఇలా ఫెయిల్ మార్కులు వేస్తే, మోదీ-మమతాలు రాజకీయ శత్రువులు కాబట్టి విమర్శిస్తున్నారని అనుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇలా విమర్శిస్తే, ఇది వరి ధాన్యం సేకరణ గొడవ వల్ల, రాష్ట్రంలో బిజెపి దూకుడు పెరిగినందున కెసిఆర్ ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. దీనికి తోడు వీళ్లవెరూ స్వతహాగా ఆర్థిక శాస్త్ర చదవుకున్నవాళ్లు కాదు. జిడిపి, హోల్ సేల్ ఫ్రైస్ ఇండెక్స్, ఇన్ ఫ్లేషన్, గ్రోెత్ రేట్., ట్రేడ్ బ్యాలన్స్ వంటి వంటి విషయాలలో నిపుణులు కాదు. వారు ప్రజానాయకులు మాత్రమే. అందువల్ల ఆర్థిక శాస్త్రవేత్త , బిజెపిలో సీనియర్ నాయకుడు అయిన డా. సుబ్రమణియన్ స్వామి చేసిన విమర్శను విస్మరిచండానికి వీల్లేదు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం హోల్ సేల్ ప్రైస్ బేస్డ్ ఇన్ ఫ్లేషన్ (WPI Inflation) మార్చిలో 14.55 శాతానికి పెరిగింది. క్రూడాయిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగింది. ఇలా ఇన్ ఫ్లేషన్ పెరగడం 12 వ సారి. అంటే 2021 ఏప్రిల్ నుంచి నిరాటంకంగా ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. ప్రజలు అధిక ధరలతో కొట్టు మిట్టాడుతున్నారని అర్థం. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం , అదే సమయంలో పెట్రోలు డీజిల్ ధరలు రూడా పెరిగి, కుటుంబాలమీద ఆర్థిక భారం తడిసి మోపెడయి ప్రజల జీవితం గడవడం కష్టంగా మారిందని ఎకనమిక్ టైమ్స్ రాసింది. ఆర్థిక రంగంలోనే కాదు, దేశభద్రత, సరిహద్దు కాపలా విషయాలలో కూడా ప్రధాని మోదీ విఫలమయ్యాయరని డా. స్వామి అన్నారు. అంతేకాదు, చివరకు దేశీయంగా పేగసస్ స్పైవేర్ తో రాజకీయాలను అదుపులోచేయాల్సిరావడం దారుణమని ఆన్నారు. కాశ్మీర్ లో శాంతి నెలకొంటుందని చెప్పి ఆర్టికిల్ 370 రద్దు చేసినా కాశ్మీర్ పరిస్థితి ఆందోళన కరంగానే ఉందని డా. స్వామి అన్నారు.
ప్రధాని మోదీ సబ్జక్టుల వారీగా ఫెయిల్ అయ్యారు. ఏఏ సబ్జక్టులలో ఫెయిల్ అయ్యారో డాక్టర సుబ్రమణియన్ స్వామి తన ప్రొగ్రెస్ రిపోర్టులో వివరంగా చెప్పారు.
Modi Government’s Report Card:
Economy—FAIL
Border Security–FAIL
Foreign Policy –Afghanistan Fiasco
National Security —Pegasus NSO
Internal Security—Kashmir Gloom
Who is responsible?–Subramanian Swamy— Subramanian Swamy (@Swamy39) November 24, 2021
దీనికి బిజెపి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఎందుకంటే, ఒక వైపు అపుడపుడు ఇలా ఫెయిల్ మార్కులు వేస్తూను, ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తిన సందర్బాలు కూడాఉన్నాయి. మోదీ నాయకత్వంలో భారత్ సూపర్ పవర్ అవుతుందని అన్నట్లు చాలా మంది ట్విట్టర్లో ఎత్తిచూపారు. అంటే సుబ్రమణియన్ స్వామీ అంచనాలన్నీ తారుమారయ్యానే విమర్శ కూడా ఉంది.
Yes… You have supported Mr.Modi not only 2014 but again 2019 after DeMo… & Raised the expections… ‘India will become SuperPower under Mr.Modi’. So your judgement gone totally wrong.😩
Not his fault.😂— இந்திரன் (@Am_Indran) November 24, 2021
ఆర్థిక వేత్తయే అయినా, రాజకీయ వివాదాలకు సుబ్రమణియన్ స్వామి అతీతుడు కాదు. డా. స్వామి రాజకీయ రిపోర్టు కార్డును కూాడా విడుదలయ చేశారు.
@Swamy39 report card –
UPA in power – Joined congress
UPA in shambles – Left Congress.
NDA in power – Sang songs in appreciation of Modi and Sangh.
NDA in power again – Bragged more.
NDA lost in Bengal – Started whining about NDA policy.
TMC in power – Romancing TMC. Shame.— Neeraj Shukla (@neer_shukla) November 24, 2021