తిరుమల కొండల్లో అబ్బుర పరిచే తీర్థాల్లో శేషతీర్థం ఒకటి. తిరుమల ఆలయానికి కేవలం పది కిలో మీటర్ల దూరానే ఉన్నా శేషతీర్థానికి చేరుకోవడం చాలా కష్టం. కష్టేపలి. కష్టపడి, వగరుస్తూ, కాళ్లీడ్చుకుంటూ, ఈదుకుంటూ, దాటుకుంటూ, ఎక్కుతూ దిగుతూ శేషతీర్థం చేరాక అలసట బదులు మనసు ఉల్లాసభరితం అవుతుంది. అక్కడి కొండలు, గుండం, సన్నటి దారి, జలపాతం… కనువిందు చేస్తాయి. కష్టమయినా సాధ్యమే శేష తీర్థం చేరడం. గోగర్భ డ్యాం నుంచి పది కి.మీ లోపే ఉన్నా రాను పోను ట్రెకింగ్ కు నాలుగు గంటలు పడుతుంది. శేష తీర్థం యాత్ర మరచిపోలేని అనుభూతిగా మిగులుతుందని చెబుతున్నారు రాఘవశర్మ. తన శేషతీర్థం యాత్ర గురించి జర్నలిస్టు ఆలూరు రాఘవ శర్మఇక్కడ వివరిస్తున్నారు.
(రాఘవ శర్మ, జర్నలిస్టు, తిరుపతి)