ఏప్రిల్ 22 రాత్రి ఆకాశంలో అద్భుతం

ఆకాశాన్ని మనమెపుడో గాని తదేకంగా చూడం. అందుకే చాలా ఆకాశపుటద్భుతాలు మిస్సవుతుంటాం.  అందుకే నేను చాలా ముందుగా మీకు గుర్తు చేస్తున్నాను. క్యాలెండరలో ఎలెర్ట్ పెట్టుకోండి. ఈ ఏప్రిల్ 22-23 రాత్రి ఆకాశంలో ఒక అద్భుతం ఎదురు కాబోతున్నది. కొంచెం కవితాత్మకంగా చెబితే, ఆరోజు రాత్రి మీరు జాగ్రత్తగా గమనిస్తూ గడిపితే, ఆకాశంలో వెలుతురు పిట్టలు ఎగరడం మీరు చూడవచ్చు.  ఆ రాత్రి ఈ వెలుతురు పిట్టలు పెద్ద ఎత్తున ఎగురుతూ కనువిందుచేస్తాయి. వీటిని పసిగట్టేందుకు కొంచెం కష్టపడాలి.

మీడియర్ (Meteor)  అనే మాట విన్నారు కాదు. తెలుగులో ఉల్కలు అంటంటారు. ఉల్కలు అంటే ఆకాశంలో ఎక్కడి నుంచో అతివేగంగా  దూసుకువచ్చే రాళ్లు, లోహాల పెళ్లలు. అవి భూ వాతావరంలోకి రాగానే, ఇక్కడ విపరీతంగా రాపిడికి గురయి,బాగా వేడెక్కి వేల డిగ్రీల సెంట్రిగ్రేడ్ ఉష్ణోగ్రత కు చేరుకుంటాయి. ఇంతగా వేడెక్కి భూమి వైపు వస్తూ వస్తూ  50 కిమీ ఎత్తులో ఉండగానే ఆవిరైపోతాయి. చాలా వరకు ఉల్కలు ఇలా ఆవిరిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పెళ్లలు మరీ పెద్దవి అయినపుడు అవి ఆవిరికాకుండా గట్టిగా ఉంటూ భూమ్మీది పడుతూ ఉంటాయి. ఈ భూమి ఢీకొనే ఉల్క భాగాన్ని మీడియరైట్ (meteorite) అంటారు. ఇలాంటి ఉల్కలు పెద్ద ఎత్తున జడివానని (ఉల్కాపాతం) లైరిడ్స్ (Lyrids) అంటారు. ఈ లైరిడ్స్ నే  మీరు ఏప్రిల్ 22-23 రాత్రి ఆకాశంలో చూస్తారు. ఇదొక అరుదైన దృశ్యం.

లైరిడ్స్ ఎలా వస్తున్నాయి?

ఆకాశంలో కామెట్ థాచర్  (కామెట్ థాచర్) అని ఒక తోక చుక్క సూర్యూని చుట్టూ తిరుగుతూ ఉంది.  దీనినే కామెట్ 1861 G1  (Coment 1861G1) అని కూడా పిలుస్తారు. దీనిని 1861లో  ఎఇ థాచర్ అనే ఖగోళ శాస్త్రవేత్త కనిపెట్టడం తో దీనికి కామెట్ థాచర్ అనే పేరు వచ్చింది. ఒక సారి ఇది సూర్యుని చుట్టూ తిరగడానికి 415.5 సంవత్సరాలు పడుతుంది. ఇది లాంగ్ పీరియడ్ కామెట్ క్యాటగరిలోకి వస్తుంది. ఈ తరహా కామెట్స్ ఒక వలయం పూర్తి చేయడానికి కనీసం 200 సంవత్సరాలు తీసుకుంటాయి. ఇది సూర్యుని చట్టూర ఇలా తిరుగుతున్నపుడు దీని ఉపరితలం మీద రాపిడి వచ్చి పెంకులు రాలుతూ ఉంటాయి. ఇలాంటి పెంకులు లేదా ముద్దలు అనేక సంవత్సరాలు విడుదలవుతూ దాని కక్ష వెంబడి ఒక దీర్ఘాండకారం వలయం లాగా ఏర్పడ్డాయి.

ఈ రోదసిశకలాల నుంచిప్రతి సంవత్సరం భూమి దూసుకుపోతూ ఉంటుంది. ఇలా పోతున్నపుడు కొన్ని శకలాలు భూవాతావరణంలోకి వస్తూ ఉంటాయి. అవే ఉల్కాపాతంగా మారుతూ ఉంటాయి.  ఈ రోదసి శకలాల రింగ్ఎంత పెద్దదంటే ఏప్రిల్ మధ్యలో ఈ వలయంలో దూరితే,నెలాఖరుదాకా బయటకు రాలేదు.భూమి ఈ శకలాల దట్టమైన మేఘం మధ్య  ఏప్రిల్ 22న దూసుకుపోతుంది. ఆసమయలో లైరిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కామెట్ థాచర్ లైరిడ్సని  2700 సంవత్సరాలుగా మనిషి గమనిస్తున్నాడు. క్రీ.పూ. చైనీయులు లైరిడ్స్ ని గమనించినట్లు రికార్డుకెక్కింది.

లైరిడ్స్ ఎపుడు బాగా కనబడతాయి?

ఏప్రిల్ 22-23 ఆర్థరాత్రి భూమి ఈలైరిడ్స్ ను ఒడుసుకుంటూ పోతూ ఉంటుంది. వాటిని చూసేందుకు అదే అనువయిన సమయం. సాయంకాలం నుంచి  భూమికి చేరువకు వచ్చినా  సూర్యుని వెలుతురులో అవికనిపించవు. అర్థరాత్రి గాని, లేదా తెల్లవారుజామున గాని వీటిని స్పష్టంగా చూడవచ్చు. ఆకాశం బాగా దట్టంగా నల్లగా కనిపించే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. విశాలంగా ఆకాశం కనిపించాలి. అక్కడ చెట్లు భవనాలు అడ్డు రాకూడదు. నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్ ఓపికగా చూస్తూ ఉండాలి.

ఈ యూ ట్యూట్ చానెల్ లో శాంపిల్ చూడవచ్చు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *