రానున్న గంటలో హైదరాబాద్‌లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌కు ఉత్తర, పడమర వైపు మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి.
రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేస్తోంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురియవచ్చని, 30 నుంచి 40 కిలోమీట్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందనీ ఐఎండీ తెలిపింది.
రాగల 24 గంటలపాటు హైదరాబాద్ లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ,సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని ఐ ఎం డి పేర్కొంది.
ఉపరితల గాలులు దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్, 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
వర్ష సూచనలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ కాకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు