చెప్పండి, ఇలా ఇండియాలో జరుగుతుందా?

కరోనా  ఆంక్షలు ఉల్లంఘించి డౌనింగ్ స్ట్రీట్ క్యాబినెట్  రూంలో ప్రధాని బొరిస్ జాన్సన్  బర్త్ డే అంటూ ధూమ్ ధామ్ మందు  పార్టీ, పోలీసుల  ఫైన్,  ప్రధాని, ఆర్థిక మంత్రి  రాజీనామా చేయాలని డిమాండ్

 

కళ్లు మూసుకుని ఒప్పేసుకోవలసిందే. ఇలాంటిది  భారతదేశంలో  ఎపుడు జరగదు. జరుగుతుందని వూహించనేలేం. అధికారంలో ఉన్న వాళ్లకి చట్టాలు వంగి వంగి నమస్కారం చేసుకుంటే వెళ్లే దేశమిది. ఇక్కడ చట్టం ఉల్లంఘించడం ఒక నాయకుడి పలుకుబడికి సంకేతం. ప్రజలు అలాంటి నాయకుడిని గల్లీ నుంచి ఢిల్లీ దాకా గౌరవిస్తారు. అలాంటిది భారతదేశంలో మాత్రమే చెల్లుబాటవుతుంది.  విదేశాలలో ముఖ్యంగా యూరోప్  దేశాలలో సాధ్యం కాదు. అక్కడ ప్రధాన మంత్రికి, ఇతర మంత్రులకు చట్టాలు ఉల్లంఘిస్తే చర్య తప్పదు. తప్పించుకోలేరు. ఈ  చిన్న  విషయం పత్రికల్లో వచ్చి పరువు పోయే పరిస్థితికి, పదవి ప్రమాదానికి దారితీస్తుంది.

ఇపుడు బ్రిటిష్ ప్రధాని బొరిస్ జాన్సన్ కు, ఆర్థిక మంత్రి (Chancellor of Exchequer)రిషి శునక్ కు ఈ అవమానమే ఎదురవుతూ  ఉంది. కాారణం కరోనా సమయంలో ఆంక్షలు ఉల్లంఘించి చక్కగా డౌనింగ్ స్ట్రీట్ క్యాబినెట్  రూంలో ప్రధాని  బర్త్ డే అంటూ  మందు పార్టీ   చేసుకోవడమే. అందుకే దీనిని పార్టీ గేట్ (Partygate)అంటున్నారు.

” The PM and the Chancellor of Exchequer have today received notification that the metropolitan police intend to issue them with fixed penalty notices,” అని ప్రధాని కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించినట్లు రాయిటర్ వార్తా సంస్థ రాసింది.

ఒక  ప్రధాని ఇలా తన కార్యాలయం ప్రాంగణంలో చట్టం ఉల్లంఘించి  మందుపార్టీ చేసుకోవడం గత 300 సంవత్సరాలలో ఎపుడూ జరగలేదు. ” As far as we are awarem there is  no precedent for Prime Minister being found to have broken the law.”అని  బ్రిటిష్ లోక్ం సభ (హౌస్ ఆప్ కామన్స్ )  లైబ్రరీ వర్గాలు చెప్పాయి.

బ్రిటిష్ ప్రధాని బొరిస్ జాన్సన్ కు, అక్కడి ఆర్థిక మంత్రి రిషి శునక్ కు కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘించినందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదేదో పబ్లిసిటీ  కోసం జారీ చేసిన నోటీసులు కాదు.  కోవిడ్ సమయంలో  బ్రిటన్ లో అమలులో ఉన్న పాండెమిక్ కఠిన ఆంక్షలను ప్రధాని, ఆర్థిక మంత్రి ఉల్లంఘించడంతో పోలీసులు ఫైన్ వేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.చట్టాలను చేేసే వాళ్లు , అందునాప్రధానమంత్రి ఆర్థిక మంత్రి చట్టాలను ఉల్లంఘిస్తారా? అని బ్రిటన్లు అవాక్కవుతున్నారు. దేశమంతా గగ్గోలు.

ఒకటా రెండా? ప్రధాని జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్  కార్యాలయంలో  కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఏకంగా  12 పార్టీలు జరిగాయి. కరోనా లాక్ డౌన్ ఆంక్షల ప్రకారం ఎక్కడైనా సరే పార్టీలు నిషేధం. అందునా మందు పార్టీలు పూర్తిగా నిషేధం.  ఈ పన్నెండు  పార్టీలలో ప్రధాని, కుటుంబ సభ్యుల, మంత్రులు, ప్రధాని  కార్యాలయం సిబ్బంది దర్జాగా మందుకొట్టారు.

దేశంలో పార్టీల మీది నిషేధం ఉన్నపుడు జరిగిన ఈ పార్టీలలో కొన్నింటికి తాను హాజరయ్యానని ప్రధాని జాన్సన్ ఒప్పుకున్నారు. అయితే, తానీ తప్పు తెలిసి చేయలేదని, తాను తప్పు చేస్తున్నట్లు అపుడు అనుకోలేదని ప్రధాని అంటున్నారు.

గత ఏడాది జూన్ 19న డౌనింగ్ స్ట్రీట్ ప్రధాని క్యాబినెట్ రూంలో ప్రధాని బర్త్ డే సందర్భంగా జరిగిన పార్టీ గురించి విచారణ జరిపాకనే తాము ప్రధానికి, ఆర్థిక మంత్రికి నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈ వ్యవహారం తో సంబంధం ఉన్న పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

అయితే, ఒక వైపు నేనే తప్ప చేయలేదని వాదిస్తూనే ప్రధాని జాన్సన్ పూర్తి క్షమాపణ వ్యక్తం చేశారు. దీనికి కారణం డౌనింగ్ స్ట్రీట్ లో ఆయనకు సంబంధించిన కార్యాలయాలలో కరోనా కఠిన ఆంక్షలను ఉల్లంఘించి పార్టీలు చేసుకున్నారనే విషయం మీద దర్యాప్తు జరిపాక ఆయన ఇలా క్షమాపణకు సిద్ధమయ్యారు.


ఇపుడు చర్చనీయాంశయింది మందు పార్టీ చేసుకున్నారన్నది కాదు. ఒక విషాద ఘడియలో  ప్రధాని, ఆర్థిక మంత్రులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది. 


 

అయితే,  ఇపుడు చర్చనీయాంశయింది మందు పార్టీ చేసుకున్నారన్నది కాదు. ఒక విషాద ఘడియలో  ప్రధాని, ఆర్థిక మంత్రులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది.  ఎందుకంటే దేశమంతా కరోనా విజృంభించి ప్రజలు వేల సంఖ్యలో చనిపోతు దేశమంతా విషాదం, భయం, ఆవిరించిన ప్రధాని కుటుంబం, ఇతర మంత్రులు, సిబ్బంది బర్త్ డే పార్టీలు, క్రిస్మస్ పార్టీలు  విందులు చేసుకోవడం. అందుకే  ఇది రాజ్యాంగ విశ్వసనీయత సమస్య అయిందని ది కాన్వర్జేషన్ (The Conversation ) రాసింది.

పార్టీగేట్ అని చెబుతే అన్ని వైపులనుంచి రాజీనామా డిమాండ్ వినపబడగానే ఆయన క్షమాపణలు చెప్పేశారు. ” Let me say Immediately that I’have paid the fine and I once again offer full apology,” అని ప్రధాని అన్నట్లు బ్రిటన్ మీడియా రాసింది.

ఫ్రాంక్ గా చెబుతున్నా, ఆ సమయంలో ఆ పార్టీలకు వెల్తున్నపుడు  కోవిడ్  ఆంక్షలను ఉల్లంఘించి తాను తప్పుచేస్తున్నానని అనిపించలేదని ప్రధాని జాన్సన్ అన్నట్లు బిబిసి రాసింది.

 


ప్రధాని కార్యాలయం ప్రాంగణంలో మందు విందు జరిగినట్లు బయటపడినప్పటినుంచి ప్రధాని, శునక్ రాజీనామా చేయాలని పార్లమెంటు సభ్యులు కోరుతున్నారు. విచిత్రమేమంటే, ప్రధాని జాన్సన్  కన్సర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ లే  రాజీనామాచేయాలని కోరుతున్నారు. ఇది ఇండియాలో జరుగుతుందా? అయితే, ఉక్రెయిన్ యుద్ధం మొదలు కావడంతో ఈ డిమాండ్ ప్రస్తుతానికి పక్కన బడింది.  వీరిద్దరు ఊపిరి పీల్చుకున్నారు.

తాము చేసుకున్న పార్టీల గురించి పార్లమెంటును పక్కదారి పట్టించినందుకు ప్రధాని జాన్సన్, ఆర్థిక మంత్రి శునక్ లు రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.

అయితే, ప్రధాని భవితవ్యం  కన్సర్వేటివ్ ఎంపిలు ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని  మీద ఆధార పడింది. కన్సర్వేటివ్ పార్టీకి 360 మంది ఎంపిలున్నారు. వారిలో 54 మంది ప్రధాని రాజీనామా చేయాలని కోరితే, పార్లమెంటులో విశ్వాసం నిరూపించుకోవలసి వస్తుంది.

ప్రధాని  కోవిడ్ నియమాలు ఉల్లంఘించడం అనే బ్రిటన్ ప్రజలు, రాజకీయ పక్షాలు చాలా తీవ్రమయిన తప్పిదంగా భావిస్తున్నాయి. నైవిక బాధ్యత  వహిస్తూ  ప్రధాని  రాజీనామా చేయకతప్పదనే మీడియా రాస్తున్నది.    అయితే, పార్టీలో ఆయనకు వారసుడెవడూ లేకపోవడమే ఆయన అదృష్టమని పరిశీలకులు భావిస్తున్నారు.

భారతీయ సంతతికి చెందిన శునక్ ఇప్పటికేభార్య అక్షతా మూర్తి ( ఈమె ఎవరో కాదు,  ఇన్ఫో సిస్ అధినేత ఎన్ ఆర్ నారాయణ మూర్తి)  ఆదాయం గురించి బ్రిటన్ లో టాక్స్ కట్టకుండా తప్పించుకుంటున్నదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.  దాని మీద బిబిసి ఏం రాసిందో ఇక్కడ చదవండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *