‘చెల్లెలి కాపురం’ బాలయ్య మృతి

ఒకనాటి మేటి నటుడు, రచయిత, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మన్నవ బాలయ్య ఈ ఉదయం కన్నుమూశారు.

ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో  బాలయ్య తుదిశ్వాస విడిచారు. ఆయన 1930లో గుంటూరు జిల్లా చావపాడులో జన్మించారు. మద్రాసు ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ బిఇ చేశారు. ఆయనను నాటి దర్శకుడు తాపి చాణక్య సినిమాలకు పరిచయం చేశారు.

నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు. దీని దర్శకుడు తాపి చాణక్యయే.
నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. పార్వతీ కళ్యాణం,  కుంకుమ రేఖ,  భాగ్యదేవత చిత్రాలతో ఆయన తిరుగులేని నటుడిగాస్థిరపడ్డారు. పాార్వతీ కల్యాణంలో  ఆయన శివుడు, అక్కినేని నాగేశ్వరరావు నారదుడు.

ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ (1970) ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము – శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు బాలయ్య నిర్మించారు.
దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు.

చెల్లెకి కాపురం ఒక విశిష్టమయిన చిత్రం.  ఇందులో శోభన్ బాబు నటించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బంగారు నంది అవార్డులభించింది. నిజానికి ఇది ‘నలుపు తెలుపు’ అనే పేరుతో వచ్చిన నవల.  కాలేజీ రోజులలోనే దానిని రాశారు. దానిని మద్రాసు నుంచి వచ్చే తుఫాన్ అనే పత్రిక సీరియల్ గా ప్రచురించింది . 1970 నాటికి భారతదేశ చిత్రసీమలో అన్నా చెల్లెళ్ల అనుబంధం ఒక ట్రెండ్ గా నడుస్తూ ఉంది.  అందువల్ల ట్రెండ్ కు తగ్గటు నలుపు-తెలుపు నవలను చెల్లెలికాపురం సినిమాగా తీయాలనుకున్నారు.  విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని అమృత పిలిమ్స్ కిందే నిర్మించారు. కెవి మహదేవన్ సంగీతం సినిమా హిట్ అయ్యేందుకు బాగా దోహదపడింది. సినిమా పాటలన్నీసూపర్ హిట్. ముఖ్యంగా చరణ కిింకిణులు ఘల్లు ఘల్లుమనగా … అనేది మరపురాని పాట. సినారే రాసిన ఈపాటను సుశీల, ఎస్ పి బాలసుబ్రమణ్యం పాడారు. 1971 నవంబర్ 27న విడుదలయింది. చిత్రంలో శోభన్  బాబు నల్లగా ఉంటాడు.   ఇవి అన్బు తంగై గా తమిళంలో కూడా రీమేక్ అయింది.

 

చెల్లెలి కాపురం చిత్రానికి శోభన్ బాబును నల్లగా తీసుకురావడం చాలా కష్టమయింది. ఆయన పర్సనల్ మేకప్ మన్ ఆకుల అప్పారావు మొదట జర్నలిస్టు  ఏచూరి చలపతిరావుకు మేకప్ వేసి, చూసి అది సంతృప్తి నిచ్చాకే శోభన్ బాబుకు వేశారు.

ఉత్తమ కథా రచయితగా ‘ఊరికిచ్చిన మాటై’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు.

బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *