పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ లో కి విదేశీ శక్తి ప్రాసెసించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ కాసిమ్ సూరి కొట్టి వేశారు. కారణం, ఈ ప్రతిపాదన వెనక విదేశీ హస్తం ఉందని, విదేశీ శక్తుల ప్రోద్బలంతో వచ్చే ప్రతిపాదన రాజ్యాంగం 5 వ ఆర్టికల్ ప్రకారం చెల్లదని ఆయన తోసిపుచ్చారు.
Suri said the resolution could not be voted upon as it was allegedly supported by a foreign power and violated Article 5. Suri, who chaired the session in the absence of Asad Qaiser, also adjourned the session indefinitely. #etribune #news #live pic.twitter.com/DI6UdO1Ucp
— The Express Tribune (@etribune) April 3, 2022
ప్రతిపక్షాలు రాజ్యాంగమ్ లోని 95 వ అధికారం కింద అవిశ్వాస తీర్మానం తెచ్చామని గొడవకు దిగాయి. అయినా డిప్యూటీ స్పీకర్ మోషన్ ని కొట్టి వేశారు. సభకి నిరవధికంగా వాయిదా వేశారు.
National Assembly session has been prorogued pic.twitter.com/XEwnP9cWVd
— National Assembly of Pakistan🇵🇰 (@NAofPakistan) April 3, 2022
అంతకు ముందు ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతూ పరాయి దేశంలో జరిగిన ఒక కుట్ర ప్రకారమే అవిశ్వాస తీర్మానం ఎలా ప్రతిపాదనకు వచ్చిందో వివరించారు.
పాకిస్తాన్ లో ఒక వారం రోజులుగా విదేశీ బూచి గురించే చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఒక రహస్య లేఖ తన దగ్గర ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతూ వస్తున్నారు.
ఆ బూచి చూపి ఇపుడు అవిశ్వాస తీర్మానం చెల్లదన్నారు. స్పీకర్ అసద్ కైజర్ రాకపోవడంతో సభకు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించారు.