శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు

 

కొలంబో:-శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు గెజిట్‌ జారీ చేశారు. ఆర్థిక సంక్షోభానికి నిరసన వ్యక్తం చేస్తూ వందలాది అధ్యక్ష నివాసం ముందు ప్రదర్శన జరిపిన 24 గంటల్లోనే ఎమర్జెన్సీ ప్రకటించారు.

దేశంలో పెరిగిన ధరలకు, నిత్యావసర సరుకుల కొరతను వ్యతిరేకంగా ప్రజలు దేశమంతా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశ అధ్యక్షుడి ఇంటి ముందు చేప‌ట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది.

శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

దీంతో కొలంబోలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. తర్వాత ఎత్తేశారు. అయితే దేశమంతా అలజడి చెలరేగే ప్రమాదం ఉన్నందున ఎమర్జెన్సీ విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *