కొద్ది సేపట్లో విద్యార్థులతో ప్రధాని చర్చ

కొద్ది సేపట్లో అంటే సరిగ్గా పదకొండు గంటలకు  ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ  (PPC 2022) కార్యక్రమంలో పాల్గొంటారు.

పరీక్షలను ఎలాంటి ఉద్రిక్తతకు లోనుకాకుండా రాయడమెలా అనే విషయం గురించి ప్రధాని వారితో చర్చిస్తారు. ఢిల్లీ టాల్కటోరా స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంటుంది.

 

 

 

PPC 2022 కార్యక్రమాన్నిదేశ వ్యాపిత విద్యార్థుల కోసం లైవ్ ప్రసారమవుతుంది. దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలతో పాటు యూ ట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా చానెళ్లు కూడా లైవ్ ప్రసారం చేస్తాయి.

ఇటీవలి కాలంలో పరీక్షలు విద్యార్థులను విపరీతమయిన వత్తిడికి గురిచేస్తున్నాయి. పాస్, ఫెయిల్యూర్ అనేవి జీవన్మరణ సమస్యగా మారాయి. దీనితో పరీక్ష తప్పామని, అవమానంగా భావించుకుని చాలా మంది విద్యార్థులు ఆత్మ హత్యకు పాల్పడుతున్నారు. NCRB లెక్కల ప్రకారం, ప్రతిసంవత్సరం పరీక్షలు ఫెయిలయి 2500మంది దాకా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. 2014-2021 మధ్య  సుమారు 12,582  మందివిద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ వాతావరణంలో విద్యార్థుల్లో ఆత్మస్థయిర్యం పెంచేందుకు ప్రధాని  ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.

2018 ఫిబ్రవరిలో ప్రధాని ఈ కార్యక్రమంప్రారంభించారు.కోవిడ్ వల్ల 2021లో ఆన్ లైన్ ఈ కార్యక్రమం నడిచింది.

ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులకు ప్రశ్నలు వేసేందుకు అవకాశం లభించింది. ప్రధానికి ప్రశ్నలు వేసేందుకు విద్యార్థులను ఒక సృజనాత్మక పోటీ పరీక్ష నిర్వహించి ఎంపిక చేశారు. ఈపోటీ పరీక్ష  2021 డిసెంబర్లో 28 నుంచి 2022 ఫిబ్రవరి 3 దాకా mygov ప్లాట్ ఫాం ద్వారా నిర్వహించారు.  ఈ పరీక్షకు 15.7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఆయా రాష్ట్రాలలో గవర్నర్లతో కలసి పరీక్షా పే చర్చ వీక్షించేందుకు కొంతమంది విద్యార్థులను ఎంపిక చేశారు.  కోవిడ్ పాండెమిక్ తో పరీక్షల రంగంలో పెను మార్పులు వచ్చాయి.  పరీక్షలు రద్దయ్యాయి. ఆన్ లైన్ లోకి వచ్చాయి. కొన్ని రాష్ట్రాలలో పరీక్షలనేవి లేకుండదా విద్యార్థులను పాస్ చేశారు. ప్రమోట్ చేశారు. ఈనేపథ్యంలో పరీక్షా పే చర్చ 2022 జరుగుతూ ఉంది. మొత్తానికి ఈ కార్యక్రమంలో ప్రధాని స్వయంగా పాల్గొంటున్నందున  దీనిని వీక్షించేందుకు విద్యార్థులు పెద్ద ఎత్తున  ముందుకువస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *