తెలంగాణలో విపరీతంగా పెరిగిన కరెంటు వినియోగం

తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది.  ఇలా పెరగడం, అందునా వేగంగా పెరుగుతూ ఉండటం గతంలో ఎపుడూ జరగలేదని టిఎస్ ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.

ఇవాళ సాయంత్రం 3.54 నిమిషాలకు ఏకంగా 13857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యింది.

రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని ఆయన అన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదు కావడం ఇదే మొదటి సారి.

3 రోజుల క్రితం 13742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా ఇవాళ 13857 మెగా వాట్లు నమోదు అయింది.

విద్యుత్ వినియోగం ఒక దేశం ప్రగతికి, పారిశ్రామికీకరణకు, మానవాభివృద్ధికి సంకేతంగా నిపుణులు చెబుతూ ఉంటారు. తలసరి విద్యుత్ వినియోగం పెరుగుదల తెలంగాణలో          9.2 శాతం ఉంది. 2018లో ఉన్న 1896 kwh 2020 నాటికి  2071 kwh కు పెరిగింది. తెలంగాణలో మొత్తంగా 1.65 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 72.8  శాతం గృహాలకనెక్షన్ లు. 15.4 శాతం వ్యవసాయకనెక్షన్లు,  11.6 శాతం పారిశ్రామిక కనెక్షన్లున్నాయి.

తెలంగాణా  ప్రభుత్వం 25.63 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నది. హైదరాబాద్ లో అత్యిక  సంఖ్యలో 17.1 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్ల గురించి నల్గొండ జిల్లాలో అత్యధికంగా 2.03 లక్షల కనెక్షన్లు న్నాయి.

కారణమేమిటి?

ఇటీవలి కాలంలో   రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టు ల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీనితో అన్ని వైపుల నుంచి విద్యుత్ డిమాండ్ పెరిగింది.

ఒకటి రెండు రోజుల్లోనే 14000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ రావచ్చు అని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అయితే, దీని వల్ల కొరతేమీ ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

16000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చిన సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని,

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు పని చేస్తాయని అధికారులు చెబుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *