ఐఎఫ్ ఎస్ అధికారి ఉమర్ ఇమామ్ తో ఇంటర్య్యూ.
ఇంటర్వ్యూ నిర్వహించింది పశ్చిమ బెంగాల్ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎం. వి రావు.
డాక్టర్ రావు ఈ మధ్య ఈ విశేష వీడియోలను సివిల్స్ రాసే వారికి సహకరించేందుకు రూపొందిస్తున్నారు. వాటిని ట్రెండింగ్ తెలుగున్యూస్ పరిచయం చేస్తూ ఉంది. ఇందులో భాగమే ఈ ఇంటర్వ్యూ.
డాక్టర్ రావు ఇంటర్వ్యూలలో కనిపించే విశేషం, సివిల్స్ రాసే వారికి కోచింగ్ అవసరం లేదనేది. ఇంతవరకు మాట్లాడిన సివిల్స్ విజేతలంతా తాము సొంతంగా ఎలా ప్రిపేర్ అయ్యింది చెప్పడమే కాదు, కోచింగ్ ఎలా పెద్దగా ఉపయోగపడదో కూడాచెబుతూ వస్తున్నారు. కోచింగ్ ఈ మధ్య బాగా ఖరీదయిపోయింది. ఆర్థిక స్తోమత్తు లేని వారి కోచింగ్ తీసుకోలేకపోతున్నామనే నిరాశకు లోనవుతూ ఉంటారు. డాక్టర్ రావు అందించిన వీడియోలన్నీ ఇలాంటి అభ్యర్థుల్లో ఆత్మ స్థయిర్యం నింపుతాయి.
ఇపుడు ఇన్ ఫర్మేషన్ , సోషల్ మీడియా యుగంలో మనం ఉంటున్నాం. సమాచారమంతా ఇంటర్నెట్ లో దొరుకుతున్నపుడు కోచింగ్ అవసరమేలేదని అంతా పదే పదే చెబుతున్నారు. అందుకే ఈ వీడియోలు కోచింగ్ మీద ఉన్న భ్రమలను పటాపంచలుచేస్తాయి. ఇంటిదగ్గిర నుంచే సివిల్స్ కు ఎలా ప్రిపేర్ కావాలో చెబుతాయి.
ఇపుడు ఐఎఫ్ ఎస్ విజేత ఉమర్ ఇమామ్ కూడా అప్షనల్స్ ను జాగ్రత్తగా ఎంచుకుంటే కోచింగ్ అవసరం లేకుండా నే ప్రిపేర్ కావచ్చని చెబుతున్నారు. ఉమర్ చెబుతున్నవిషయాలను గమనిస్తే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ప్రిపేర్ కావడం ఎంత ఈజీయో అనిపిస్తుంది. అభ్యర్థులెవరూ సివిల్స్ పరీక్షలంటే జడిసిపోకుండా ధైర్యం నూరిపోయేడమే డాక్టర్ రావు ఇంటర్వ్యూల ఉద్దేశం కావచ్చు.
ఉమర్ ఏచెబుతున్నారో చదవండి. ఆపైన వీడియో చూడండి.
ఉమర్ ఇమామ్, బిఇ (ఢిల్లీ),
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ బ్యాచ్ 2016,
పశ్చిమబెంగాల్ క్యాడర్
ఇండియాన్ ఫారెస్ట్ సర్వీస్ ఎంపిక పద్ధతి మూడు దశల్లో ఉంటుంది. ఇందులో మొదటిది ప్రిలిమినరీ పరీక్ష. ఇది ఇతర సివిల్స్ కు అప్పియర్ అయ్యేవారందరితో కలసి రాయాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ పరీక్ష ఉంటుంది.ప్రిలిమ్స్ నుంచి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు మెయిన్ రాసే వారి నిష్ఫత్తి 1:100 ఉంటుంది. అంటే పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని అర్థం. కటాఫ్ మార్క్ లు 120 / 200కి అటు ఇటుగా ఉంటున్నవి. ప్రిలిమ్స్ రెండు పేపర్లు ఉంటాయి. అవి జిఎప్ 1, జిఎస్ 2. ప్రిలిమినరీ పరీక్ష పాప్ అయ్యేందుకు ఒక ప్రత్యేక మయిన స్ట్రాటజీ ఉంటుంది. హిస్టరీకి సంబంధించి 11, 12 తరగతులకు సంబంధించిన ఎన్ సిఇ ఆర్ టి పుస్తకాలు చదివితే బాగుంటుంది. మిగతా సబ్జక్టులకు కూడా 6 నుంచి 12 తరగతుల ఎన్ సిఇ ఆర్ టి పుస్తకాలతోనే ప్రిపేర్ కావచ్చు. ఈ పుస్తకాలన్నింటిని నేను క్షుణ్ణంగా చదివాను. వాటికి తోడు, పాలిటి, గవర్నెన్స్ కు సంబంధించి లక్ష్మీకాంత్ పుస్తకం చదివాను. ఇందులో కొన్ని ప్రత్యేకమయిన చాప్టర్లను క్షుణ్ణంగాచదివాను.
జనరల్ సైన్స్ కు కూడా ఎన్ సిఇ ఆర్ టి పుస్తకాలే చదివాను. ఇక ఫారిన్ గవర్నెన్స్ కు సంబంధించి 9 నుంచి 12 తరగతుల ఐసిఎస్ సి పుస్తకాలను ఎంచుకున్నాను. ఎన్విరాన్ మెంట్ కు సంబంధించి యుజిసి అండర్ గ్రాజ్యుయేట్స్ కోసం తీసుకువచ్చిన Erach Bharucha పుస్తకం Textbook of Environmental Studies నాకు బాగా పనికొచ్చింది. ఇక ఎకనామిక్స్ కు సంబందించి నేను పాఠ్యపుస్తకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే Economic Surveys ను సంప్రదించాను. వీటితో పాటు మరొక ముఖ్యమయిన అంశం వార్తా పత్రికలను చదవడం. పరీక్షకు ఆరునుంచి 8 నెల ముందు నుంచి న్యూస్ పేపర్స్ నుక్షుణ్నంగా ప్రతిరోజూ చదవడం చాలా అవసరం. నేయితే, న్యూస్ పేపర్లు చదవడంతో పాటు చదవాల్సినవేమిటో ఒక లిస్టు తయారు చేసుకునే వాడిని. ఏదయినా ఒక అంతర్జాతీయ సంఘటన ఎదురయినపుడు, దాని గురించి క్షుణ్నంగా తెలుసుకునేందుకు ప్రయత్నించే వాడిని. ఇలాంటి టాపిక్ ల జాబితాను తయారుచేసుకుని ఆదివారం నాడు కంప్యూటర్ ముందర కూర్చుని గూగల్ సెర్చ్ లో ఈ టాపిక్ ల గురించి సమాచారమంతా సేకరించేవాడిని. ఇలా న్యూస్ లో ఉన్న ప్రతి టాపిక్ మీద క్షుణ్ణంగా తెలుసుకునే వాడిని. ఇదీ ప్రిలిమినరీకి నేను ప్రిపేర్ అయిన విధానం.
ఇక మెయిన్స్ గురించి చూద్దాం.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాసేందుకు ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులు మాత్రమే అర్హులు. ఐఎఫ్ ఎస్ కు ఆప్షనల్స్ బాగా పరిమితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్,అగ్రికల్చర్ ఇంజనీరింగ్, సైన్స్ సబ్జక్టులే. వీటిలో కొన్ని రకాల కాంబినేషన్స్ నే ఎన్నుకోవాలి. మెయిన్స్ ని 1400 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 300 మార్కులు ఇంగ్లీష్ పేపర్ కు ఉంటాయి. ఇందులో Essay కి వందమార్కులుంటాయి. ఇది చాలా ముఖ్యం. జనరల్ స్టడీస్ కు మరొక 300 మార్కులుంటాయి. తర్వాత రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క దానిని 400 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ఆప్షనల్స్ రెండు బాగాలు , పార్ట్ ఎ, అండ్ పార్ట్ బి అని ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ రెండు సెక్షన్లు ఉంటాయి, ఎ, బి అని. ప్రతిఅప్షనల్ ఐదు ప్రశ్నలు రాయాలి. ఒక్కొక్క పార్ట్ నుంచి రెండు ప్రశ్నలు తప్పని సరిగా ఉండాలి.
మెయిన్స్ లో అభ్యర్థులు తమ అండర్ గ్రాజ్యుయేట్ సబ్జక్టులను ఎంపిక చేసుకుంటేనే మంచిదనేది నా సూచన. నా ఆప్షనల్ ఫిజిక్స్. నా ఎకడిమిక్ బ్యాక్ గ్రౌండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. మనం అండర్ గ్రాజుయేట్ లో చదివిన సబ్జక్టు తీసుకుంటే కొంతయినా పరిచయం ఉంటుంది. ఇది ప్రిపేరషన్ కు బాగా పనికొస్తుంది. గ్రాజ్యుయేషన్ స్థాయిలో చదివిని సబ్జకునే ఒక అప్షనల్ గా తీసుకుంటున్నాం కాబట్టి, ప్రత్యేకించి కోచింగ్ అనేది అవసరం ఉండదు.
రెండు అప్షనల్ నుంచి మనకు ఉన్న ఆసక్తిని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. రెండో ఆప్షనల్ ను ఎంచుకునేముందు ఆ సబ్జక్టు మీద అందుబాటులో ఉన్న పుస్తకాలు, సిలబస్ భారం కూడా చూసుకోవాలి. ఇది మెయిన్ వ్యవహారం. తర్వాత వచ్చేది ఇంటర్వ్యూ. మూడో దశ, చివరి దశ కూడా. ఇవన్నీ పాస్ అయ్యాక, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ఎంపిక అయిన అభ్యర్థులకు మరొక దశ పరీక్ష ఉంటుంది. అది శారీరక సామర్ఠ్యం పరీక్ష. ఇదే వాకింగ్ టెస్ట్. దీని గురించి మరొక సారి చూద్దాం.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి క్లుప్తంగా…
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అద్భుతయిన సర్వీస్. అడవుల, జంతవులు, ఇతర ప్రాకృతిక సంపదన పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఒక విశిష్టమయిన సర్వీస్. అఖిల భారత సర్వీస్ లల్ ఒక ముఖ్యమయిన సర్వీస్. 1951 ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ ప్రకారం 1966 నుంచి మొదలయింది. అయితే, నిజానికిది పున: ప్రారంభం మాత్రమే. 1865 నుంచి1935 దాకా బ్రిటిష్ హయాంలో ఇదొక ముఖ్యమయిన సర్వీస్ గా ఉంటూ వచ్చిందే. 1867లో ఈ సర్వీస్ అభ్యర్థుల ఎంపిక మొదలయింది. అపుడు అయిదురుగు అభ్యర్తులను ఎంపిక చేసి వారిని ఫ్రాన్స్, జర్మనీలలో శిక్షణ కోసం పంపే వారు. ఈ విధానం 1885 దాకా కొనసాగింది. మధ్యలో రష్యా ఫ్రాన్స్ ల మధ్య యుద్ధం వచ్చినపుడు మాత్రం కొద్ది రోజులు నిలిపివేశారు.1885 నుంచి 1905 దాకా మరొక విధానం మొదలయింది.అడు 173 మంది ప్రొబేషనర్లను ఎంపిక చేసి వారికి లండన్ లోని కూపర్స్ హిల్ (Cooper’s Hill) శిక్షణ ఇచ్చారర. తర్వాత 1927 మధ్య ఆక్స్ ఫోర్డ, కేంబ్రిడ్జ్, ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయాలలో శిక్షణ ఇచ్చారు. తర్వాత దేశంలోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం డెహ్రాడూన్ లో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభించారు. ఇక్కడ 1926 నుంచి శిక్షణ మొదలయింది. 1932 దాకా కొనసాగింది. తర్వాత ఈ శాఖ అధికారులకు డిమాండ్ లేక పోవడం ఈసర్వీస్ ను మూసేశారు. 1935తో భారత ప్రభుత్వం చట్టం అమలులోకి వచ్చాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ను ఎత్తేశారు. సర్వీసులో ఉన్న అధికారులంతా క్రమంగా రిటైరవుతూ ఉండటంతో మళ్లీ ఫారెస్ట్ అధికారుల కొరత ఏర్పడింది. 1938 లో ఇండియన్ ఫారెస్ట్ కాలేజ్ ఏర్పాటయింది. 1927లో అడవులను రాష్ట్రాల అధికారాల్లోకి మార్చారు. రాష్ట్రంలోని ఉన్నఫారెస్ట్ అధికారులనుంచి సుపీరియర్ అధికారులను ఎంపిక చేసి ఇండియన్ ఫారెస్ట్ కాలేజీ లో శిక్షణ ఇవ్వడమ మొదలుపెట్టారు. ఈ సర్వీస్ ఉద్దేశం అటవీ సంపదను శాస్త్రీయ పద్ధతులలో కాపాడటం. 1977లో అడవులు మళ్లీ కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి మారాయి. 1966 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పునరుద్ధరించారు.